ట్రీట్ యూత్ లో హాట్ టాపిక్ గా మారిన మత్తుకళ్ల బ్యూటీ

thesakshi.com   :    జానవులే నెరజానవులే.. వర వీణవులే!! అంటూ సిల్క్ స్మిత `ఆదిత్య 369`లో అదిరే నృత్యంతో ట్రీటిచ్చిన వైనం బాలయ్య అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేరు.. ఇదిగో ఇక్కడ జానను చూస్తుంటే పూల్ సైడ్ మస్త్ మజా ట్రీట్ ఓ రేంజులో ఉందిలే అని గుసగుసలు మొదలైపోయాయి. ఇంతకీ ఎవరీ స్విమ్మింగ్ పూల్ క్వీన్? మత్తుకళ్ల మస్తీ బ్యూటీ.. అంటారా?

ఇంకెవరు.. మాళవిక మోహనన్. ఇంకా ఈ అమ్మడు నటించిన డైరెక్ట్ తెలుగు సినిమా ఏదీ లేకపోయినా ఇప్పటికే టాలీవుడ్ లోనూ ఈ అమ్మడికి ఫ్యాన్సున్నారు. ఇంతకుముందు రజనీకాంత్ పేటలో నటించింది. అది తమిళ డెబ్యూ సినిమా. ఆ సినిమా అనువాదం తెలుగులో రిలీజైంది. అప్పుడే మనవారికి మాళవిక మోహనన్ గెస్ట్ రోల్ తో పరిచయమైంది.

ఇకపోతే ఇప్పుడు దళపతి విజయ్ సరసన మాస్టర్ లాంటి క్రేజీ సినిమాలో నటిస్తోంది. ఆ మూవీని కూడా తెలుగులో క్రేజీగా అనువదించి రిలీజ్ చేయనున్నారు. తదుపరి తెలుగు సినిమాతోనూ ఈ అమ్మడు ట్రీటివ్వనుందట. మాళవిక ప్రముఖ ఛాయాగ్రాహకుడు మోహనన్ కుమార్తెగా అందరికీ సుపరిచితం. ఇక సొంత ట్యాలెంటుతోనూ ఈ అమ్మడు రాణిస్తోంది.

అందుకే అందరి గురి ఈ అమ్మడిపైనే. ఇకపోతే మాళవిక నిరంతర సోషల్ మీడియా ట్రీట్ యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా పూల్ సైడ్ మత్తుకళ్లతో మతులు చెడగొట్టింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *