జనవరిలో మేం ముగ్గురం : అనుష్కా శర్మ

thesakshi.com   :   బాలీవుడ్ హీరోయిన్ అనుష్కా శర్మ తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విరాట్ కోహ్లి తన అర్ధాంగి తల్లి కాబోతున్న విషయాన్ని వెల్లడిస్తూ ‘ఇప్పుడు ఇద్దరమే కానీ వచ్చే ఏడాది జనవరిలో మేం ముగ్గురం కాబోతున్నాం’ అంటూ శుభవార్తను అందరితో పంచుకున్నాడు.

ఈ క్రమంలో తాజాగా అనుష్క ఆమె కడుపులో ఉన్న శిశువు కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లు ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలో అనుష్క సముద్ర తీరాన నిలబడి తన గర్భాన్ని చూసుకొని మురిసిపోతున్నట్లు తెలుస్తోంది.

అనుష్క శర్మ బేబీ బంప్ చూపిస్తూ.. ”ఒక జీవి నీలో ప్రాణం పోసుకునే సందర్భాన్ని ఆస్వాదించడానికంటే నిజమైనది.. మధురమైనది మరేదీ లేదు. ఇది మీ నియంత్రణలో లేనప్పుడు నిజంగా ఇది ఏమిటి?” అని క్యాప్షన్ పెట్టింది. ఈ ఫొటోకు విరాట్ స్పందిస్తూ “నా జీవితం అంతా ఒక్క ఫ్రేములో ఉంది” అని కామెంట్ చేశారు.

ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టబోయే బిడ్డ కోసం విరుష్క జంట ఎదురు చూస్తున్నారు. ఐపిఎల్ సీజన్ కోసం వెళ్లిన విరాట్ తో పాటు అనుష్క కూడా యుఎఇలో ఉన్నారని తెలుస్తోంది. 2017 డిసెంబర్ 11న ఇటలీలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి – అనుష్క జంట ప్రేమ వివాహం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *