బర్త్ డే రోజు కౌగిలింత కావాలట!

thesakshi.com    :     కెరీర్ ప్రారంభించిన ఐదారేళ్లలోనే స్కైలోకి దూసుకెళ్లింది కియరా. ప్రతిభకు లక్ కలిసొచ్చి సక్సెస్ తోడై ఈ అమ్మడి రేంజ్ ఇంతింతై అన్నట్టుగా ఎదిగేసింది.

బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది. పనిలోపనిగా బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో పడిందన్న పుకార్ ఎలానూ ఉంది.

కియరా పుట్టినరోజు సందర్భంగా ఆ ఇద్దరి మధ్యా ఎఫైర్ మ్యాటర్ మరోసారి అభిమానుల్లో హాట్ టాపిగ్గా మారింది. 28వ బర్త్ డే కాబట్టి… పుట్టినరోజు కేక్ లో 28 కొవ్వొత్తులను వెలిగించింది.

అభిమానులు.. స్నేహితులు .. సహచరులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. వీటన్నిటినీ మించి `షేర్షా` సహనటుడు సిద్ధార్థ్ మల్హోత్రా నుండి ఒక స్వీట్ మెసేజ్ వచ్చింది.

సిద్ధార్థ్ తన ఇన్ స్టాగ్రామ్ లో కియారా అద్వానీ ఫోటోని పోస్ట్ చేసి ఆల్మోస్ట్ ప్రపోజ్ చేసినంత పని చేశాడు. “పుట్టినరోజు శుభాకాంక్షలు షైనింగ్ గాళ్…నీకు నా ప్రేమ .. కౌగిలింతలు“ అంటూ నిజంగానే ప్రేమను కురిపించాడు. దానికి ప్రతిస్పందిస్తూ.. `ధన్యవాదాలు మంకీ“ అని రిప్లయ్ ఇచ్చింది.

కియారా అద్వానీతో సిద్ధార్థ్ లవ్ స్టోరీ ఇప్పటిది కాదు. షేర్షా షూటింగ్ సమయంలో పరిచయం ప్రేమగా మారిందని కథనాలొచ్చాయి. ఆ తర్వాత దానికి కియరా ఖండించనూ లేదు.. అంగీకరించిందీ లేదు.

కార్గిల్ యుద్ధంలో మరణించి పరం వీర్ చక్ర బిరుదాంకితుడైన కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రంలో నటించేప్పుడే ఇద్దరి మధ్యా చనువు పెరిగింది.

కియారా అద్వానీ చివరిసారిగా నెట్ఫ్లిక్స్ గిల్టీలో కనిపించింది. సినీకెరీర్ సంగతి చూస్తే.. అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్.. సిధార్థ్ మల్హోత్రా- భూల్ బులయా 2.. కార్తీక్ ఆర్యన్ ఇందూ కి జవానీ చిత్రాల్లో కియరా నటించింది.

2014లో ఫగ్లీ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన కియరా 2016 లో ఎంఎస్ ధోని: ది అన్టోల్డ్ స్టోరీలో నటించింది. ఆ చిత్రం తన ఫేట్ మార్చేసింది. భరత్ అనే నేను.. వినయ విధేయ రామ లాంటి తెలుగు చిత్రాల్లో నటించింది. కబీర్ సింగ్- గుడ్ న్యూజ్ చిత్రాల సక్సెస్ తో బాలీవుడ్ లో మరో మెట్టు పైకి ఎక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *