కిల్లర్ డాక్టర్ మృత దేహాలని ఏం చేసేవాడంటే ?

thesakshi.com   :    ఈ ప్రపంచంలో దేవుడి తరువాత స్థానం కచ్చితంగా డాక్టర్ దే. ఎందుకు అంటే ఆ దేవుడు మనకి జన్మ ఇస్తే..ఈ కనిపించే దేవుడు పునర్జన్మను ఇస్తాడు.

అందుకే దేవుడితో సమానంగ్ఫా డాక్టర్ కి కూడా దండం పెడతారు. ప్రస్తుతం కరోనా క్లిష్ట సమయంలో కూడా ఎంతోమంది వైద్యులు ప్రాణాలని పనంగా పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు.

అలాంటి వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా ఓ డాక్టర్ ప్రవర్తించాడు. ప్రాణం పొసే డాక్టర్ స్థానంలో ఉంటూ 100 మంది ప్రాణాలని తీసాడు.

ఆయుర్వేద డాక్టర్ దేవేంద్ర శర్మ నేర చరిత్ర గురించి తెలుసుకుంటుంటే .. అతడు ఎంత నరరూప రాక్షసుడో అర్థమౌతుంది.

డాక్టర్ దేవేంద్ర కేవలం కిడ్నీ రాకెట్ మాత్రమే కాకుండా ఫేక్ గ్యాస్ ఏజెన్సీ వాహనాలను దొంగిలించి అమ్మడం లాంటి పనులను కూడా చేసినట్లు తెలుస్తోంది.

గ్యాస్ ఏజెన్సీ కోసం సిలిండర్లను తీసుకువెళ్లే వాహనాలను ఆపి డ్రైవర్లను హత్య చేసేవాడు. . జనవరి 1994లో గ్యాస్ ఏజెన్సీ డీలర్ షిప్ కోసం రూ. 11 లక్షలు పెట్టుబడి పెట్టాడు. 1994 ఆగస్టులో కంపెనీ నష్టాలతో మూతబడింది. 1995లో శర్మ ఫేస్ గ్యాస్ ఏజెన్సీని మొదలు పెట్టాడు.

ఈ సమయంలో శర్మ గ్యాస్ సిలిండర్లను తీసుకువెళ్లే వాహనాలను ఆపి డ్రైవర్లను హత్య చేసేవాడుచంపేసేవాడుఅలా 24 మంది వరకు హత్య చేశాడు.

తరవాత డాక్టర్ అమిత్తో కలిసి కిడ్ని రాకెట్లో పాల్గొన్నాడు. ఒక్కో కిడ్నీకి రూ. 7 లక్షల వరకు తీసుకునేవాడు. అలా 125 కిడ్నీ ట్రాన్స్ ప్లాన్ టేషన్స్ వరకు చేశారు.

తరువాత ట్యాక్సీని అద్దెకు తీసుకొని ఢిల్లీ- ఉత్తరప్రదేశ్ రోడ్డుకు తీసుకువెళ్లి డ్రైవర్ ను చంపేసి ట్యాక్సీని సెకెండ్ హ్యాండ్ దుకాణంలో అమ్మేవాడు. అలాగే రాజస్తాన్ లో తన క్లినిక్ ను నడిపేవాడు.

ఇక్కడ అందరికి ఆశ్చర్యం కలిగించే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే దేవేంద్ర శర్మ మృతదేహాలని ఎవరికీ అనుమానం రాకుండా ఉత్తరప్రదేశ్ కాస్ గంజ్లోని హజ్ చెరువులో పడేసేవాడు.

అక్కడే దేనికి అంటే అక్కడ ముసళ్లు ఎక్కువగా ఉంటాయి. ఆనవాళ్లు ఏం దొరకకుండా చేయడానికి దేవేంద్ర శర్మ ఈ విధంగా చేసేవాడని పోలీసుల విచారణలో తేలింది.

కాగా శర్మ 16 ఏళ్లు జైల్లో గడిపాడు. జనవరి 28 2020లో సత్ప్రవర్తన కారణంగా 20 రోజుల పాటు పెరోల్పై విడుదలయ్యడు.

ఫిబ్రవరి 16న తప్పించుకొని అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయాడు. తాజాగా జూలై 28న దేవేంద్ర శర్మను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అరెస్ట్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *