కరోనా కేసులు అదుపులో ఎక్కడ ఉన్నాయి?

thesakshi.com   :    వరుసగా 24 రోజుల పాటు కొత్త కేసులు నమోదు కాని దేశంగా న్యూజీలాండ్ ప్రధాని ప్రపంచ ప్రజల ప్రశంసలు అందుకున్నారు.

ఆ దేశంలో పరిస్థితులు తిరిగి యధాస్థితికి నెమ్మదిగా రావడం మొదలుపెట్టాయి. కానీ, న్యూజీలాండ్ పాటించిన పర్యవేక్షణ విధానం పటిష్టంగా ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

దక్షిణ కొరియా కూడా టెక్నాలజీ, కాంటాక్ట్ ట్రేసింగ్‌ ఉపయోగంచుకుని కేసుల సంఖ్యను తగ్గించగలిగారని, వరసగా మూడు రోజుల పాటు కొత్త కేసులు నమోదు కాలేదని ప్రశంసలందుకుంది. కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ సియోల్‌లో నైట్ క్లబ్‌లలో క్లస్టర్లు ఎక్కువగా ఉండటంతో దక్షిణ కొరియాలో సెకండ్ వేవ్ మొదలైందని అధికారులు చెబుతున్నారు.

ఇంకొక మూడు రోజుల్లో గనక 30 కేసులు నమోదైతే, తిరిగి భౌతిక దూరం నియమాలను విధించనున్నట్లు సియోల్ మేయర్ హెచ్చరించారు.

బ్రిటన్‌లో రోజుకు 1,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి.

వియత్నాంలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. ఆ దేశంలో లాక్‌డౌన్ చర్యలు, సరిహద్దు నియంత్రణ, ఇన్ఫెక్షన్ స్థాయిని నియంత్రణలో ఉంచడానికి పనికివచ్చాయి.

ఆఫ్రికాలో కొన్ని దేశాలలో భయపడినంత రీతిలో ఇన్ఫెక్షన్ వ్యాప్తి జరగలేని విషయంపై స్పష్టత లేదు.

అధిక సంఖ్యలో పరీక్షలు చేయటానికి తగినన్ని మౌలిక సదుపాయాలు లేకపోవడం కూడా వైరస్ వ్యాప్తి గురించి పూర్తిగా తెలియకపోవడానికి ఒక కారణమని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

కొన్ని దేశాలలో జనాభాలో యుక్త వయసు వారు ఎక్కువగా ఉండటం వలన కూడా వైరస్ బారిన పడే వారు తక్కువగా ఉన్నారని ఇంకొక వాదన ఉంది.

అలాగే, బయట దేశాలతో సంబంధాలు లేని దేశాలలో కూడా ఈ ఇన్ఫెక్షన్ వ్యాప్తి తక్కువగా ఉందని మరొక వాదన.

వైరస్‌ని అదుపులోకి తెచ్చిన దేశాలలో కూడా తిరిగి సాధారణ పరిస్థితులు రావడానికి మరి కొంత సమయం పడుతుంది.

కానీ, కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని డాక్టర్ నబర్రో వేసిన అంచనా మాత్రం చాలా దేశాలను భయపెడుతోంది. ఈ మహమ్మారి మరింత పెరిగే లోపే అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగినంత సహాయం అందడం అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *