మనస్తాపం తో ఓ మహిళ ఆత్మహత్య!

thesakshi.com    :    వివాహేతర సంబంధం ఆ మహిళ హత్యకు కారణమైంది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆ మహిళను భర్త, తల్లి, సోదరుడు పలుసార్లు మందలించారు. అయినా ఆమె తీరులో మార్పు రాలేదు. దీంతో ఆమెను కొట్టారు. అయితే అనుకోని విధంగా ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కొన్ని రోజుల క్రితం కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లాహెచ్‌.మురవణి గ్రామ పరిధిలోని ఎల్‌ఎల్‌సీలో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. వివాహేతర సంబంధం తెలిసి మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

అయితే మహిళ తలపై గాయాలు ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. విచారణ చేపట్టడంతో.. ఆ మహిళది హత్య అని తేలింది. హత్య చేసింది మృతురాలి భర్త, తల్లి, బావ అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన వీరారెడ్డి భార్య ప్రభావతి స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలియడంతో భర్త వీరారెడ్డి ఆమెను పలుసార్లు మందలించాడు. అయినా ఆమె తీరులో మార్పు రాలేదు. బాధితురాలి ప్రవర్తన మార్చుకోకపోవడంతో ఆమె తల్లి, తన సోదరుడితో కలిసి గత నెల 31న ఇంట్లోనే చితకబాదారు.

ఈ క్రమంలో ప్రభావతి స్పృహ కోల్పోయింది. దీంతో ఆమె చనిపోయిందని భావించిన నిందితులు.. ఆమెను కారులో తీసుకెళ్లి ఎల్‌ఎల్‌సీలో పడేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొనఊపిరితో ఉన్న ఆమెను చుట్టపక్కల పొలాల రైతులు గమనించి బయటకు తీయగా కొద్దిసేపటికే మృతిచెందింది. పోలీసులు కేసు విచారణ చేపట్టి ప్రభావతిది హత్యగా తేల్చారు. తాము దొరికిపోతామని భావించిన నిందితులు గురువారం హెచ్‌.మురవణి వీఆర్‌ఓ సురేష్‌ ఎదుట హాజరై నేరం చేసినట్లు అంగీకరించడంతో ఆయన ఫిర్యాదు మేరకు హత్య కేసుగా మార్చారు. నిందితులను అరెస్ట్‌ చేసి, హత్యకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *