పెంపుడు కుక్కచనిపోయిందని ఆత్మహత్య చేసుకున్న యువతి..!

thesakshi.com   :    కుక్కను కుక్క అంటే కోపం వస్తుందా? అంటే.. కచ్చితంగా వస్తుంది. కుక్కల్ని తమ కుటుంబ సభ్యులుగా భావించే ఎంతోమంది ఇలానే ఫీల్ అవుతుంటారు.కుక్కల్ని పెంచుకునే వారి దగ్గర కుక్కల గురించి ఒక చిన్న తేడా మాట అన్నా.. వారు ఏ మాత్రం ఇష్టపడకపోవటమే కాదు.. నెగిటివ్ గా ఫీల్ కావటం ఖాయం. చాలామందికి ఇలాంటి అనుభవాలుఎదురై ఉంటాయి. అయితే.. కొందరు తమ ఇంట్లో పెంచుకునే కుక్కల్ని.. తమ ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వారు బోలెడంతమంది కనిపిస్తారు.

ఇప్పుడు చెప్పే ఉదంతం ఇలాంటి వాటన్నింటికి భిన్నం. పెంపుడు కుక్కచనిపోయిందని. ఏకంగా సూసైడ్ చేసుకున్న షాకింగ్ వైనమిది. ఛత్తీస్ గఢ్ లోని రాయ్ గఢ్ జిల్లాలో ప్రియాంషు సింగ్ అనే యువతి పీజీ చదువుతోంది. కుటుంబంతో కలిసి ఉండే ఆమె ప్రేమగా నాలుగేళ్ల కుక్కను పెంచుకుంటోంది. అనారోగ్యంతో ఆ కుక్క మరణించింది. దాని అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత తాను కూడా ఈ చనిపోదామని ప్లాన్ చేసిన ఆమె.. ఇంట్లోని ఐరన్ పైప్ కు ఎవరూ లేని టైంలో ఆత్మహత్య చేసుకుంది.

ఈ ఉదంతం గురించి తెలిసిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆమె రాసిన సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. తన చివరి కోరికగా.. తన పెంపుడుకుక్క సమాధి పక్కనే తనను ఖననం చేయాలని కోరారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *