thesakshi.com : పద్దెనిమిదేళ్ల కుర్రాడి ఉన్మాదానికి ఏ పాపం ఎరుగని పది మంది ప్రాణాలు కోల్పోయిన అసాధారణ సంఘటన అగ్రరాజ్యంలోని న్యూయార్కు మహానగరంలో చోటు చేసుకుంది. కొద్ది గంటల ముందు చోటు చేసుకున్న (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8.30 గంటలకు) ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. న్యూయార్కులోని బఫెల్లో సూపర్ మార్కెట్లో పద్దెనిమిదేళ్ల కుర్రాడు ఒకడు విచక్షణ రహితంగా గన్ తో కాల్పులు జరపటం.. ఈ షాకింగ్ ఉదంతం నుంచి తేరుకోకముందే.. పది మంది ప్రాణాలు అక్కడికక్కడే విడవటం జరిగిపోయాయి.
అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం బఫెలో నగరంలో శనివారం మధ్యాహ్నం ఒక సూపర్‌మార్కెట్‌లో దుండుగుడు జరిపిన తుపాకీ కాల్పుల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇది జాతి విద్వేషంతో పాల్పడిన నేరంగా పరిగణిస్తూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కొంత ప్రతిఘటన తర్వాత 18 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి పేరును పోలీసులు వెల్లడించలేదు.
అనుమానితుడు శనివారం మధ్యాహ్నం సూపర్‌మార్కెట్‌లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత తుపాకీతో కాల్పులు ప్రారంభించాడు. ఈ దాడిని ఆన్‌లైన్‌లో లైవ్-స్ట్రీమ్ చేయటానికి అతడు ఒక కెమెరాను ఉపయోగించినట్లు పోలీసులు చెప్పారు.
ఇది ‘హింసాత్మక తీవ్రవాద’ చర్య అని ఎఫ్‌బీఐ అభివర్ణించింది.
బఫెలో నగరంలో ప్రధానంగా నల్లజాతి ప్రజలు నివసించే ఈ ప్రాంతానికి చేరుకోవటానికి అనుమానితుడు కొన్ని గంటల పాటు కారు నడుపుకుని వచ్చినట్లు భావిస్తున్నారు.
ఈ కాల్పుల్లో మొత్తం 13 మందికి తూటాలు తగిలాయని, వారిలో అత్యధికులు నల్లజాతి వారేనని బఫెలో పోలీస్ కమిషనర్ జోసెఫ్ గ్రమగిలా చెప్పారు. పది మంది చనిపోగా, మిగతా ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు.
సూపర్‌మార్కెట్ దగ్గర సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్.. అనుమానితుడి మీద కాల్పులు జరపటానికి ప్రయత్నించి, అతడి కాల్పుల్లో చనిపోయారు.
ఈ దారుణ హననానికి పాల్పడిన దుర్మార్గుగ్ని పేటన్ జెండ్రాన్ గా గుర్తించారు. ఈ టీనేజ్ ఉన్మాది తీరుపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. పేటన్ జెండ్రాన్ ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే.. తాను లొంగిపోనని.. తనను తాను కాల్చుకుంటానని బెదిరింపులకు దిగాడు. అయితే.. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇతగాడిని వదిలి పెట్టకూడదని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడికి సంబంధించిన వివరాలు సేకరిస్తూ.. కాల్పుల వెనుకున్న అసలు కారణం ఏమిటన్న అంశాన్ని ఆరా తీస్తున్నట్లుగా చెబుతున్నారు.