thesakshi.com : ప్రత్యేక హోదా ఏమైంది?
కేంద్రం దగ్గర మెడలు వంచి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు
విభజన హామీల అమలు ఏమయ్యాయి?
వైసీపీ అవినీతి వల్లే రాష్ట్రం దివాళా
కోనసీమలో మీరే దాడిచేసుకొని మీరే రాజకీయం చేస్తారా?
గొడ్డలిపోటును గుండెపోటని చెప్పి రాజకీయాలు
ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామన్నారు ఏమైంది?
వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే కేటాయిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. నేడు ఒంగోలు లో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నేడు పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ కోసం పనిచేసే వాళ్లకే అవకాశాలు వస్తాయన్నారు. రాష్ట్ర అప్పుల భారం రూ.8 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. వైసీపీ అవినీతి వల్లే రాష్ట్రం దివాళా తీసిందన్నారు.
ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘సంక్షేమం లేదు.. అంతా మోసకారి సంక్షేమమే. వైసీసీ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు. నిన్న ISBలో ప్రధాని నా పేరును ప్రస్తావించకపోవచ్చు. కానీ నా కృషి వల్లే ISB.. హైదరాబాద్‌కు వచ్చింది. రూ.2 లక్షల కోట్ల సంపదను నాశనం చేశారు. పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. మద్యం, గంజాయి, డ్రగ్స్‌తో రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా మార్చారు. కేంద్రం దగ్గర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. ప్రాజెక్టులు కట్టడం చేతకాకపోతే ఏపీ ప్రభుత్వం గద్దె దిగిపోవాలి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రత్యేక హోదా తెస్తామన్న వైసీపీ హామీ ఏమైందని ఏమైందని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఒంగోలులోని మండువవారిపాలెంలో నిర్వహించిన టీడీపీ మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ అవినీతి వల్లే రాష్ట్రం దివాళా తీసిందన్నారు. సంక్షేమం లేదని, అంతా మోసకారి సంక్షేమమేన్నారు. పోలవరంలో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందన్నారు. పోలవరంలో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. 30లక్షల ఇళ్లని చెప్పిన మీరు కట్టింది మూడే ఇళ్లన్నారు. అడిగితే కేసులు పెడుతున్నారని, మీ కేసులు మమ్మల్ని ఏమీ చేయలేవన్నారు. వర్షాకాలంలో రోడ్లపై చేపలు పట్టేలా రోడ్లపై నీళ్లు ఉంటున్నాయన్నారు.*
*గొడ్డలిపోటును గుండెపోటని చెప్పి రాజకీయాలు చేశారు: గొడ్డలిపోటును గుండెపోటని చెప్పి రాజకీయాలు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. నేడు ఒంగోలులో మహానాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు కోడి కత్తి డ్రామా ఆడారన్నారు. ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు నమ్మారన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేశాడన్నారు. సమస్యను పక్కదారి పట్టించేందుకు కోనసీమ అల్లర్లు తీసుకొచ్చారన్నారు. కోనసీమలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని వాపోయారు. ‘‘మంత్రిని కాపాడిన పోలీసులు ఇల్లు తగలబడకుండా ఎందుకు ఆపలేదు? మీరే దాడిచేసుకొని మీరే రాజకీయం చేస్తున్నారు.
రాజ్యసభ సీట్లలో ముగ్గురు మరో రాష్ట్రం వాళ్లకు ఇచ్చారు. సహ నిందితులకు రాజ్యసభ సీట్లు ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామన్నారు ఏమైంది? 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు. పోలవరం ఏమైంది..? విభజన హామీల అమలు ఏమయ్యాయి? గెలిచిన తర్వాత కేంద్రం దగ్గర మెడలు వంచి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. జగన్ దిగిపోతే తప్ప మంచి రోజులు రావు. జగన్ అండ్ కంపెనీ ఆదాయం పెరిగింది. క్విట్ జగన్.. సేవ్ ఏపీ నినాదం ప్రతి ఇంట్లో వినిపించాలి.