THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Crime

వైయస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక ట్విస్ట్ !

సీబీఐ డైరెక్టర్‌కు దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి లేఖ

thesakshiadmin by thesakshiadmin
November 18, 2021
in Crime, Latest
0
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కు దారి తీసిన కారణాలు ఏమిటి ?
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com   :   సీబీఐ డైరెక్టర్‌కు దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి లేఖ..

వైయస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో కొన్ని కోణాలపై విచారణ జరపాలని విజ్ఞప్తి

దస్తగిరి ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై మీడియాలో చర్చలు నడుస్తున్నాయి.
ఈ హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను నిర్దోషిని..నన్ను ఉద్దేశ పూర్వకంగా ఈకేసులో ఇరికిస్తున్నారు.వైయస్‌. వివేకానందరెడ్డి మరణం విషయం నాకు తెల్లవారుజామన తెలిసింది.

ఆ సమయంలో హైదరాబాద్‌లో వివేకానందరెడ్డి బావమరిది ద్వారా నాకీ విషయం తెలిసింది.చంద్రబాబు ప్రభుత్వంలో ఏర్పాటైన సిట్‌.. పలుమార్లు నన్ను విచారించింది.2019 మార్చి నెలలో వారంరోజులపాటు నాపై విచారణచేశారు.విచాణ సమయంలో నన్ను తీవ్రంగా హింసించారు.

మళ్లీ 2019 నవంబర్‌లో నన్ను విచారించారు
ఈ కేసును సీబీఐకి అప్పగించిన తర్వాత మరో మూడు సార్లు కూడా నాపై విచారణ చేశారు
ప్రతిసారి నేను విచారణ సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నాను, నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పాను.

వైయస్‌. వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత ఆమె కుమార్తె వైయస్‌.సునీత ప్రతిరోజూ మీడియతో టచ్‌లోనే ఉంటున్నారు
దురుద్దేశాలను ఆపాదిస్తూ పత్రికా ప్రకటనలు చేస్తున్నారు.

దర్యాప్తు అధికారులను కలుస్తూ, వారితో సమావేశాలు నిర్వహిస్తూ దురుద్దేశాలను ఆపాదిస్తూ పిటిషన్లు ఇస్తున్నారు
దర్యాప్తు సరైన మార్గంలో నడుస్తుందనుకుంటున్న సమయంలో వివేకా కుమార్తె సునీత మీడియా ముందుకు వచ్చి తప్పుడు స్టేట్‌మెంట్లు ఇచ్చారు
దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు.

ఆమె ఇష్టాయిష్టాల ప్రకారం.. అమాయకులైన వ్యక్తులపై ఆరోపణలు చేస్తూ, నిందలు మోపారు.వైయస్‌.సునీత లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులపై ఓ వర్గం మీడియా పథకం ప్రకారం ప్రచారం చేసింది.

ఏబీఎన్‌ఛానల్, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో సునీత నిరంతరం టచ్‌లో ఉన్నారు.ఇదే ఛానల్, పత్రిక వైయస్సార్‌ కాంగ్రెస్‌పైన, అమాయకులపైన నిరంతరం దుష్ప్రచారం చేసింది.

కారణాలేంటో తెలియదుగాని సునీత వ్యవహారం భిన్నంగా ఉంది:
వివేకా భౌతిక కాయం దగ్గర దొరికిన లేఖ వ్యవహారంలో వైయస్‌.సునీత, ఆమె భర్త ఎన్‌.రాజశేఖర్‌రెడ్డితో పాటు, ఎన్‌.శివప్రకాష్‌రెడ్డి వ్యవహారశైలి అసహజంగా ఉంది:
చాలా అనుమానాలను రేకెత్తిస్తోంది:
వివేకా హత్య ఘటనలో దాగి ఉన్న వ్యక్తులను బయటకు తీయాలి.వారు చాలా క్రూరులు, నిజాలను వెలికి తీయాలి.

వైయస్‌.సునీత, వారి భర్త ఎన్‌.రాజశేఖరరెడ్డి ప్రతిసారి దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రకటనలు, తప్పుడు పిటిషన్లు ఇచ్చారు.

వారు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో నిజాలు బయటపెట్టాలి.
దర్యాప్తు సక్రమంగా, సజావుగా, నిష్పక్షపాతంగా జరగాలి.లేకపోతే హంతకులు తప్పించుకుని, అమాయకులు బలి అవుతారు.వివేకా గారి ఫోన్‌లోని డేటాను, సమాచారాన్ని వారు టాంపర్‌చేసి, డిలీట్‌ చేసిన తర్వాత దర్యాప్తు సంస్థలకు ఇచ్చారా? లేదా? ఈ అంశాన్ని తేల్చాలి.
ఎర్రగంగిరెడ్డి ఘటనా స్థలానికి ఎలా చేరుకున్నారు? ఎవరు చెప్తే ఆయన అక్కడకు వచ్చారు? ఆయనతో టచ్‌లో ఉన్న వివేకా కుటుంబ సభ్యులు ఎవరు?

ఘటనా స్థలంలో ఫొటోలు తీయాలని, వీడియో తీయాలని ఆదేశాలు ఇచ్చిన ఇనాయతుల్లాకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు?
పీఏ మూలి వెంకట కృష్ణా రెడ్డి మొబైల్‌ఫోన్, వివేకా రాసినట్టుగా చెప్తున్న లేఖను ఎందుకు దాచిపెట్టారు? దీనిపై నిజాలు రాబట్టాలి
వివేకా కుమార్తె సునీత పదేపదే సీబీఐ అధికారులతో సమావేశమయ్యారు. ప్రతి వారం వారితో సమావేశాలు జరిపారు? ఇన్ని సార్లు కలవడం వెనుక కారణం ఏంటి? ఇది సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేయడం కదా? తాను అనుకున్నట్టుగా దర్యాప్తును జరపడంలేదా?

ఇంటరాగేషన్‌ లేకుండా దస్తగిరికి కేవలం ఐదురోజుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు అయ్యింది. సునీత భర్తే లాయర్‌ను పెట్టి ఆయనకు బెయిల్‌ ఇప్పించాడు. తన తండ్రిని చంపిన వ్యక్తికి సునీత, ఆమె భర్త ఎందుకు సహాయపడుతున్నారు?

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే వివేకా హత్య జరిగింది. 40 ఏళ్లుగా వైయస్సార్‌ కుటుంబానికి పులివెందుల పెట్టనికోటలా ఉంది. వివేకాను తొలగించుకోవడం ద్వారా పార్టీని పెంచుకోవాలనే ఆలోచన చేసి ఉండరా? ఈప్రశ్నకు దర్యాప్తు ద్వారా సమాధానం రాబట్టాలి.

వివేకా హత్యకు కొన్ని వారాల ముందు బిటెక్‌.రవి, ఆదినారాయణరెడ్డి ఇతరులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. తర్వాత వారు విజయవాడలో ఒక హోటల్‌లో సమావేశమయ్యారు. అక్కడే కుట్రపన్నారు.

బిటెక్‌.రవి, ఆదినారాయణరెడ్డి, అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబి వెంకటేశ్వర్రావుతో సమావేశమయ్యారు. మొత్తం కుట్ర అక్కడే జరిగింది.

పరమేశ్వర్‌రెడ్డి ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌గా జాయిన్‌ అయ్యారు. తర్వాత ఆస్పత్రిలో ఎవరికీ చెప్పకుండా వచ్చేశారు. ఆతర్వాత బీటెక్‌ రవితో సమావేశమయ్యాడు. వివేకా హత్యకు ముందురోజు మార్చి, 14, 2019న కడప హరిత హోటల్‌లో వీరిద్దరూ మాట్లాడుకున్నారు. దీనిపై దర్యాప్తు చేయాలి. తర్వాత చంద్రబాబు, వివేకా హత్యను తన రాజీకీయ ప్రచారంగా వాడుకున్నారు. 2019 ఎన్నికల్లో ఈ ఘటన గురించే ప్రచారం చేశారు. వివేకా హత్య.. టీడీపీకి అడ్వాంటేజ్‌. ఈ కోణంలో సీబీఐ విచారణచేయాలి.

2016 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డిపై బీటెక్‌ రవి గెలుపొందారు. వివేకానందరెడ్డి వల్ల బీటెక్‌ రవి రాజకీయ జీవితానికి అడ్డుపడే అవకాశాలున్నాయి. ఈ కోణంలోకూడా విచారణ చేయాలి.

వివేకా ప్రాణాలకు ముప్పుందని తెలిసినా టీడీపీ గన్‌మ్యాన్‌ను ఎందుకు తొలగించింది? అతన్ని హత్యచేయాలనే ఉద్దేశంతోనే తొలగించలేదా? వివేకాను తొలగించాలని బీటెక్‌ రవి, ఆదినారాయణరెడ్డి కుట్రచేశారు. పులివెందుల, కపడ ప్రాంతాల్లో రాజకీయ స్వలాభం కోసమే ఈ పనికి పాల్పడ్డారు.

వివేకా హత్య వెనుక చంద్రబాబు, ఏబి. వెంటకేశ్వర్రావు, బి.టెక్‌.రవి, ఆదినారాయణరెడ్డిల కుట్ర కోణంపై విచారణచేయాలి.

Tags: #AP#CBI#CRIME NEWS#YS VIVEKANANDA REDDY#YS VIVEKANANDA REDDY MURDER CASE
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info