thesakshi.com : బెంగళూరులో గురువారం నాడు 46 ఏళ్ల బీజేపీ నేత అనంతరాజు మృతిపై పోలీసుల విచారణలో అతడు హనీట్రాప్‌కు గురయ్యాడని తేలింది. ఈ ఘటన వెనుక ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి హస్తం ఉందని అతని భార్య ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
మృతుడు హీరోహళ్లి వార్డు నంబర్ 72కి చెందిన స్థానిక కార్యకర్త కాగా, బ్యాదరహళ్లిలోని తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందాడు.
అతని బంధువు మనోజ్ వాంగ్మూలాల ప్రకారం, థైరాయిడ్ సంబంధిత అనారోగ్యంతో మనస్తాపం చెంది అనంతరాజు ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అయితే, బీజేపీ నాయకుడి బ్యాదరహళ్లి ఇంటి నుంచి పోలీసులు డెత్ నోట్‌ను కనుగొన్నారని, అతను హనీట్రాప్ బాధితుడని ధృవీకరించినట్లు తాజా మీడియా కథనాలు పేర్కొన్నాయి.
సూసైడ్ నోట్‌లో, అనంతరాజు తనను వేధించినందుకు ఒక మహిళను నిందించాడు మరియు అతని భార్యను క్షమించమని కూడా కోరాడు. అసహజ మరణం కేసును ఇప్పుడు ముగ్గురు వ్యక్తులపై ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసుగా పోలీసులు మార్చినట్లు సమాచారం.
ఐటీ హబ్ బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ లీడర్ అనంతరాజు ఆత్మహత్య కేసులో అనేక మంది విచారణ తరువాత ఆ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. అనంతరాజు ఆమె ఫేస్ బుక్ ప్రియురాలితో అక్రమ సంబందం పెట్టుకుని ఆమె టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని అనంతరాజు భార్య, కుటుంబ సభ్యులు ఆరోపించారు.
బీజేపీ లీడర్ ను అతని భార్య సుమా టార్చర్ పెట్టడం వలనే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఇదే సమయంలో అనంతరాజు భార్య సుమా, అతని ప్రియురాలు అంటున్న రేఖా మాట్లాడుకున్న ఆడియో క్లిప్పింగ్ బయటకు రావడంతో కలకలం రేపింది.
ఇప్పటికే కేసు విచారణ చేస్తున్న పోలీసులు బీజేపీ లీడర్ భార్యకు నోటీసులు ఇచ్చి విచారణ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. బీజేపీ నాయకుడు అనంతరాజు భార్య సుమా పోలీసుల విచారణలో అనేక రహస్య సమాచారం బయటపెట్టిందని తెలిసింది. అయితే పోలీసులు మాత్రం సుమా ఏం చెప్పారు ? అనే విషయాన్ని గోప్యంగా పెట్టారు.
ఆనంతరాజు ఆత్మహత్య చేసుకునే ముందు 40 రోజులు ఇంటి నుంచి బయటకురాలేదని, ఎవ్వరి ఫోన్ కాల్స్ కూడా రిసీవ్ చెయ్యలేదని, ఎవ్వరినీ కలవలేదని వెలుగు చూసింది. అయితే ఈ విషయంలో కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారులు అధికారికంగా సమాచారం ఇవ్వడం లేదు.
బీజేపీ నాయకుడు అనంతరాజు ఆత్మహత్య కేసులో ఆయన భార్య సుమా, అనంతరాజు ప్రియురాలు అని ప్రచారం జరుగుుతన్న కేఆర్ పురం నివాసి రేఖాతో పాటు అనేక మందిని పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరించారు. అనంతరాజు ఉపయోగించిన ఫోన్ నెంబర్ కు సంబంధించిన కాల్ డేటాను పోలీసులు సేకరించి పూర్తి సమాచారం బయటకు లాగుతున్నారు.
అనంతరాజు భార్య సుమా, రేఖా మాట్లాడుకున్న ఆడియో బయటకు రావడంతో ఆ ఆడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి అసలు మ్యాటర్ బయటకు లాగుతున్నారు. మొత్తం మీద బీజేపీ నాయకుడు అనంతరాజ్ ఆత్మహత్యకు అసలు కారణం ఎవరు ? అనే విషయం త్వరలోనే బయటకు వస్తుందని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు.