thesakshi.com : రాష్ట్రంలో ఏసీబీ, దిశ, ఎస్ఈబీ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, అధికారులను ఆదేశించారు. దిశ తరహాలో అవినీతి ఫిర్యాదులకుగానూ ఏసీబీ యాప్ తేవాలని ఆయన అధికారులకు సూచించారు.
యాప్ ద్వారా ఆడియో ఫిర్యాదు సైతం చేయొచ్చని పేర్కొన్నారు. అవినీతి చోటు చేసుకుంటున్న విభాగాలను క్లీన్ చేయాల్సిందేని ఆయన అధికారులను ఆదేశించారు. నెలరోజుల్లోగా ఏసీబీ యాప్ రూపకల్పన జరగనుందని, నేర నిర్ధారణకు ఫోరెన్సిక్ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు. అలాగే మండల స్థాయి వరకూ ఏసీబీ స్టేషన్లు ఉంటాయని చెప్పారు.
అవినీతి నిరోధానికి 14400 టోల్‌ఫ్రీ నంబరు పెట్టాం. ఈ నంబరుకు విస్తృత ప్రచారం కల్పించాలి. ఏసీబీ విధులేమిటి, ఎలా పని చేస్తుందన్నది విస్తృతంగా ప్రజలకు తెలియాలి. అవినీతి జరుగుతున్నట్టుగా ఆడియో రికార్డ్ పంపించినా సరే చర్యలు తీసుకునేట్టుగా వ్యవస్థ ఉండాలి.
మండల స్థాయి వరకూ ఏసీబీ వ్యవస్థను బలోపేతం చేయాలి. దిశ, ఎస్‌ఈబీ (స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో), ఏసీబీలకు మండల స్థాయిల్లో స్టేషన్లు ఉండాలి. ఈ మూడింటినీ పర్యవేక్షించడానికి జిల్లా స్థాయిలో ఒక అధికారి ఉండాలి.
అవినీతి నిరోధానికి ఒక యాప్‌ను పెట్టాలి. లంచాల కేసుల్లో అరెస్టయిన వారికి వేగంగా శిక్షలు పడాలి. ప్రస్తుతం ఉన్న చట్టాలను పరిశీలించి అవసరమైతే మార్పులు, చేర్పులు చేసి సమర్థవంతంగా అమలు చేయాలి. ఎలాంటి అవినీతి వ్యవహారంపైనైనా ఏసీబీ పర్యవేక్షణ చేపట్టాలి.
ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై వచ్చిన ఫిర్యాదులపైనా ఏసీబీ దృష్టి పెట్టాలి. సంబంధిత శాఖలు ఆ ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యలను ఏసీబీ పర్యవేక్షించాలి. దీనికోసం వివిధ ప్రభుత్వ విభాగాలు, ఏసీబీ మధ్య సినర్జీ ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి. ఏసీబీకి ఫిర్యాదు చేయాల్సిన నంబర్‌ను ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో బాగా కనిపించేలా హోర్డింగ్స్ పెట్టాలి. యాప్ ద్వారా ఎలా ఫిర్యాదు చేయాలనే సూచనలను ఆ హోర్డింగ్స్‌లో పొందుపరచాలి.
అవినీతి జరుగుతున్న విభాగాలను ప్రక్షాళన చేయాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. “దిశ” తరహాలో అవినీతిపై ఫిర్యాదులకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు ప్రత్యేక యాప్ రూపొందించాలన్నారు. అనిశా దిశ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దిశ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్ర జగన్ అధికారులను ఆదేశించారు. హోంశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. అవినీతి జరుగుతున్న విభాగాలను ప్రక్షాళన చేయాల్సిందేనని అన్నారు. దిశ తరహాలో అవినీతిపై ఫిర్యాదులకు అనిశాకు ప్రత్యేక యాప్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో యాప్ రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు.
మండల స్థాయి వరకు ఏసీబీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. అంతేకాకుండా ఇతర విభాగాల్లో అవినీతి ఫిర్యాదులపైనా ఏసీబీ పర్యవేక్షణ ఉండాలని వెల్లడించారు. నేర నిర్ధరణకు ఫోరెన్సిక్ విభాగం బలోపేతం చేస్తామని సీఎం జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారాలను చోటు ఉండకూడదని.. దాన్ని కూకటివేళ్లతో సహా పెకలించాలన్నారు. డ్రగ్స్ విషయంలో విద్యాసంస్థలపై ప్రత్యేక నిఘా పెట్టాలని.. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకి ప్రత్యేక కాల్ సెంటర్ నంబరు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో హోమంత్రి తానేటి వనిత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
“ఏసీబీ దిశ ఎస్ఈబీ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత. దిశ తరహాలో అవినీతిపై ఫిర్యాదులకు అ.ని.శా.కు యాప్. నేర నిర్ధరణకు ఫోరెన్సిక్ విభాగం బలోపేతం చేస్తాం. మండల స్థాయి వరకు అ.ని.శా. స్టేషన్లు ఏర్పాటు చేయాలి. ఇతర విభాగాల్లో అవినీతి ఫిర్యాదులపైనా అ.ని.శా. పర్యవేక్షణ. రాష్ట్రంలో డగ్స్ వ్యవహారాలకు చోటు ఉండకూడదు. డ్రగ్స్ వ్యవహారాలను కూకటివేళ్లతో సహా తొలగించాలి. డ్రగ్స్ విషయంలో విద్యా సంస్థలపై ప్రత్యేక నిఘా. ఎస్ఈబీకి ప్రత్యేక కాల్ సెంటర్ నంబరు ఏర్పాటు చేయాలి“ అని జగన్ సూచించడం విశేషం.
ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో అవినీతికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వకూడదని, ఎక్కడా అవినీతి అన్నది కనిపించకూడదని చెప్పారు. ఏసీబీకి ఇది ప్రాథమిక విధి కావాలని, అవినీతి కేసులు ఎక్కువగా నమోదవుతున్న విభాగాలపై ఏసీబీ మరింతగా దృష్టి సారించాలని సూచించారు.
గ్రామ, వార్డు సచివాలయాలు అవినీతికి దూరంగా ఉన్నందున, భవిష్యత్తులో కూడా ఈ వ్యవస్థలో అవినీతి కనిపించకూడదని.. అందుకోసం అవసరమైన ఎస్‌ఓపీలు తయారు చేయాలని ఆదేశించారు. ‘గ్రామ, వార్డు సచివాలయాల్లోకి సబ్ రిజిస్ట్రార్ వ్యవస్థలు వస్తున్నాయి. సర్వేయర్లు వస్తున్నారు. భూముల పంపకాల వల్ల వచ్చే డివిజన్, సర్వే, రిజిస్ట్రేషన్ తదితర ప్రక్రియలన్నీ సచివాలయాల్లోనే జరుగుతాయి. అలాంటి సందర్భాల్లో కూడా అవినీతికి ఆస్కారం ఉండకూడదు. అవినీతి చోటు చేసుకుంటున్న వ్యవస్థలను క్లీన్ చేసుకుంటూ వెళ్లాలి’ అని చెప్పారు.