thesakshi.com : ఒకవైపు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు, మరోవైపు కేబినెట్ ను పునర్వ్యస్థీకరించారు. ఇదే ఊపులో పార్టీ సంస్థాగత నిర్మాణం. పార్టీకి నూతన జిల్లాల వారీగా అధ్యక్షులను నియమించారు.
వచ్చే 2024 ఎన్నికల్లో ఏపీలో మరోసారి పాగా వేయాలని వైసీపీ అధినేత.. సీఎం జగన్ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన చాలానే ఆశలు పెట్టుకున్నారు. దీంతో ఎన్నికలకు రెండు సంవత్స రాల ముందుగానే.. ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ప్రారంభించారు. నిజానికి గత 2019 ఎన్ని కల సమయంలోనూ.. రెండేళ్ల ముందుగానే జగన్ ప్రజల్లోకి వచ్చారు. ఇక ఇప్పుడు కూడా అదే వ్యూహంతో రెండు సంవత్సరాల ముందుగానే ఆయన ప్రజల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే వైసీపీ నేతలు ఇంటింటికీ వైసీపీ కార్యక్రమానన్ని నిర్వహించాలని.. ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులు.. ఇలా అందరూ పాల్గొనాలని జగన్ నిర్దేశించారు. ఇక ఇప్పుడు ఈ కార్యక్రమాల పర్యవేక్షణతో పాటు.. నాయకులను ముందుండి నడిపించేం దుకు.. పార్టీని లైన్లో పెట్టేందుకు.. జిల్లా స్థాయిలో రీజినల్ కోఆర్డినేటర్లను నియమించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు కూడా పూర్తయినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల మంత్రి పదవులు పోయిన వారు.. సహా కొత్త మంత్రుల్లో కొందరిని కూడా ఈ పదవుల్లో నియమించారు.
మొత్తం 14 మంది మాజీ మంత్రులు ఉన్నారు. వీరిలో అందరినీ కాకుండా.. కొందరిని జిల్లా ప్రాంతీయ కో ఆర్డినేటర్లుగా న నియమించుకుని.. వీరితోపాటు.. కొత్త మంత్రులను కూడా కొందరికి ఈ బాధ్యతలు అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో ఉండే పోటీని తట్టుకుని.. గెలుపు గుర్రం ఎక్కేలా వ్యూహాలు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.
జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రులను జగన్ ప్రభుత్వం నియమించింది. గుంటూరు- ధర్మాన ప్రసాదరావు కాకినాడ- సీదిరి అప్పల్రాజు శ్రీకాకుళం- బొత్స సత్యనారాయణ అనకాపల్లి- రాజన్నదొర పార్వతీపురం- గుడివాడ అమర్నాథ్ విజయనగరం- బూడి ముత్యాలనాయుడును ఇన్చార్జ్ మంత్రులుగా నియమించారు.
పశ్చిమగోదావరి- దాడిశెట్టి రాజా ఏలూరు- పినిపే విశ్వరూప్ తూర్పుగోదావరి- చెల్లుబోయిన వేణుగోపాల్ ఎన్టీఆర్ జిల్లా- తానేటి వనిత పల్నాడు- కారుమూరి నాగేశ్వరరావు బాపట్ల- కొట్లు సత్యనారాయణ అమలాపురం- జోగి రమేష్ ఒంగోలు-మేరుగ నాగార్జున విశాఖ-విడదల రజని కృష్ణా- రోజా నెల్లూరు- అంబటి రాంబాబు కడప- ఆదిమూలపు సురేష్ అన్నమయ్య- కాకాణి గోవర్ధన్రెడ్డి అనంతపురం- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతి- నారాయణస్వామి నంద్యాల- అంజాద్ బాషా కర్నూలు- బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సత్యసాయి- గుమ్మనూరు జయరాం చిత్తూరు- ఉషశ్రీ చరణ్ను ఇన్చార్జ్ మంత్రులుగా ప్రభుత్వం నియమించింది.
జిల్లా పార్టీ అధ్యక్షులుగా చిత్తూరు- కేఆర్జే భరత్ అనంతపురం- కాపు రామచంద్రారెడ్డి సత్యసాయి- శంకర్నారాయణ ఎన్టీఆర్ జిల్లా- వెల్లంపల్లి శ్రీనివాస్ గుంటూరు- మేకతోటి సుచరిత కర్నూలు- బాలనాగిరెడ్డి నెల్లూరు- మేమిరెడ్డి ప్రభాకరరెడ్డి బాపట్ల- మోపిదేవి వెంకట రమణ నంద్యాల- కాటసాని రాంభూపాలరెడ్డి గుంటూరు- కొడాలి నాని అన్నమయ్య- గడికోట శ్రీకాంత్రెడ్డి కడప- సురేష్ బాబు తిరుపతి- చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రకాశం- మదుసూదన్ యాదవ్ను వైసీపీ జిల్లా అధ్యక్షులుగా ప్రకటించారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల్లోని ప్రాంతాల్లో కీలకమైన నాయకులు పార్టీ ఇంచార్జ్లుగా ఉ న్నారు. ఉత్తరాంధ్రకు విజయసాయిరెడ్డి రాయలసీమకు సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి ఉభయ గో దావరి జిల్లాల సమన్వయకర్తగా వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. గుంటూరు కృష్నాజిల్లాల వైసీపీ సమన్వయ కర్తగా.. ఎంపీ మోపిదేవి వెంకటరమణ నెల్లూరు కర్నూలు జిల్లా బాధ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి వ్యవహరిస్తున్నారు. అయితే… ఇప్పుడు వీరిని పక్కన పెట్టి.. కొత్త జిల్లాల ప్రాతిపదికన.. బాధ్యతలు అప్పగించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజు జూలై 8న వైఎస్సార్‌సీపీ ప్లీనరీ నిర్వహిస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఆలోగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలను జిల్లా అధ్యక్షులు సమన్వయం చేసుకుంటూ వైఎస్సార్‌సీపీ గ్రామ, మండల కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా పార్టీ నిర్మాణంలో, పార్టీని బలోపేతం చేయడంలో ప్రాంతీయ సమన్వయకర్తలు క్రియాశీలక పాత్ర పోషించనున్నారు.