thesakshi.com : విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు నిరసనగా తన ఎమ్మెల్యే పదవికి తాజాగా రాజీనామా చేసిన సంగతి విధితమే.
రాజకీయాలకు అతీతంగా ఉక్కు పోరాటం చేస్తామని, నాన్ పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేస్తామని కూడా ఆయన ప్రకటించారు.
అయితే గంటా ఇపుడు మళ్ళీ హఠాత్తుగా టీడీపీ ఎమ్మెల్యే అవతారం ఎత్తేశారు. తన ఉత్తర నియోజకవర్గం నుంచి జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కార్పోరేటర్ అభ్యర్ధులతో సమావేశాన్ని నిర్వహిస్తూ బాగా బిజీ అయిపోయారు.
జీవీఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి తీరాలంటూ గంటా పిలుపు ఇస్తున్నారు. మొత్తానికి గంటా రాజీనామా చేసిన తరువాత టీడీపీ పాలిటిక్స్ లో యాక్టివ్ కావడం విశేషం.
మరి గంటా రాజీనామాను స్పీకర్ ఎపుడు ఆమోదిస్తారో తెలియదు కానీ ఆయన మాత్రం పసుపు పార్టీ గెలుపును భుజానికెత్తుకుని గట్టిగా పనిచేయడానికే రెడీ అయినట్లుగా ఉంది.
ఇదంతా సరే కానీ స్టీల్ ప్లాంట్ కోసం నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు అన్నది ఎపుడు అని మరో వైపు ప్రత్యర్ధులు ప్రశ్నలు సంధిస్తున్నారు.