thesakshi.com : టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. అటు ఇండస్ట్రీ వారి నుండి ఇటు అభిమానుల నుండి పెద్దఎత్తున గ్రీటింగ్స్ అందుకున్నాడు బన్నీ. అయితే గతరాత్రి మోస్ట్ అవెయిటింగ్ ఫిల్మ్ పుష్ప నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు స్టైలిష్ సినిమాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. బన్నీ – సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ సినిమా ఇది. అయితే టీజర్ విడుదల చేసిన సందర్బంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా వేరే రాష్ట్రాలలో ఉన్నటువంటి ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడాడు. అది తమిళ మలయాళం కన్నడ నార్త్ లేదా ఇతర దేశాలలో ఉన్నవారందరికి థాంక్స్.
ఎందుకంటే మీరు తెలుగు సినిమాలు చూడటం వల్లనే తెలుగు మార్కెట్ పెరిగింది. ఇది కేవలం మీవల్లే సాధ్యం అయిందని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. ఈరోజు బన్నీ పుట్టినరోజు కావడంతో అభిమానులు భారీ ఎత్తున బన్నీ ఇంటివద్దకు చేరుకున్నారు. వారందరి అరుపులు వినిపించి బయటికి వచ్చిన బన్నీ.. అభివాదం చేసి అందరికి థాంక్యూ చెప్పాడు. అలాగే అభిమానులు బహుమానంగా అందించిన మొక్కలను అందుకున్నాడు.
ఫ్యాన్స్ కోసం తగ్గేదే లే అనే డైలాగ్ వినిపిచి వారిని ఖుషీ చేసాడు. అయితే బన్నీని చూసి విష్ చేసేందుకు అభిమానులు మాత్రం వీధుల్లో నిండిపోయారు. ఇక పుష్ప సినిమా ఆగష్టు 13న విడుదల అవుతుండగా.. మైత్రి మూవీస్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ కాగా డిఎస్పీ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం పుష్ప ఇంట్రడక్షన్ వీడియోతో సినిమా పై అంచనాలు మాత్రం భారీస్థాయికి చేరుకున్నాయి.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ”పుష్ప”. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. బన్నీ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా అల్లు అర్జున్ మేకోవర్ కి ప్రశంసలు వస్తున్నాయి. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ చిత్రం పలు ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తున్నాయి.
‘పుష్ప’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా సంస్థలు కలిసి దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తోంది. సినిమాలో ఎక్కువ భాగం అడవుల్లో భారీ తారాగణం సిబ్బందితో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాని స్టార్ట్ చేసినప్పుడే 6 నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. బడ్జెట్ లో మెజారిటీ భాగం రెమ్యూనరేషన్స్ కి కేటాయించారట. అల్లు అర్జున్ – సుకుమార్ పారితోషకం తో పాటుగా లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.
మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ కు విలన్ రోల్ కోసం 5 కోట్లకు పైగానే ఇస్తున్నారట. ఇక స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రష్మిక కు కూడా భారీగానే ముట్టజెప్తున్నారట. పాన్ ఇండియా మూవీ కావడంతో ఇతర ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ నటీనటులను తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ప్రకాష్ రాజ్ – జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఆస్కార్ అవార్డ్ గ్రహీత రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు.
‘పుష్ప’ చిత్రాన్ని ఆగస్ట్ 13న తెలుగుతో పాటు తమిళం మలయాళం హిందీ కన్నడ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే కోవిడ్ నేపథ్యంలో ఈ సినిమాని అనుకున్న సమయానికి విడుదల చేయకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ ‘ఆర్.ఆర్.ఆర్’ దసరా రేసు నుంచి తప్పుకుంటే ‘పుష్ప’ చిత్రాన్ని అక్టోబర్ 13న విడుదల చేసే ఆలోచన కూడా చేస్తున్నారట. మరి రానున్న రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.