THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

అమరరాజా బ్యాటరీస్ మూసివేత..!!

thesakshiadmin by thesakshiadmin
August 4, 2021
in Latest, Politics, Slider
0
అమరరాజా బ్యాటరీస్ మూసివేత..!!
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com   :   టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజా బ్యాటరీస్ సంస్థలో ఉత్పత్తి నిలిపివేస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కంపెనీ నుంచి విడుదలయ్యే సీసంతో కూడిన నీటిని మొక్కల పెంపకానికి వినియోగిస్తోందని.. దీని వల్ల మొక్కలతో పాటు జంతు జాలానికి, మానవ మనుగడకు ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేసింది. రెండు పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యపు నీరు మల్లె మడుగు రిజర్వాయర్, ఆ సమీపంలోని మరో నీటి వనరుకు వెళుతున్నట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గుర్తించింది. అంతేకాకుండా వర్షం కురిసిన సమయంలో భూగర్భ జలాలు మరింత కలుషితమవుతున్నట్లు తెలిపింది.

మరోవైపు పరిశ్రమలకు నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో సీసం కలుషితం చేసిందని సాంకేతిక కమిటీ నిర్ధారించింది. అంతేకాకుండా గాలిలోకి 137 మరల ద్వారా సీసీపు ధూళిని విడుదల చేస్తున్నట్లు గుర్తించింది. ప్రతి ఆరు నెలలకోసారి సీసం నమూనాలను పీసీబీకి ఇవ్వాల్సి వుండగా.. ఒక్కసారి కూడా సమర్పించలేదని ఆరోపించింది.

పూర్తి స్థాయిలో దీనిపై అధ్యయనం చేయాలని.. కోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగినట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది. ఏ పరిశ్రమనూ మూసివేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, పర్యావరణానికి హానీ జరగకుండా ఉత్పత్తి చేసుకోవచ్చని తెలిపింది. అమరరాజా కంపెనీ కాలుష్య నివారక ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలని పీసీబీ సూచించింది.

Tags: #AMARA RAJA BATTERIES LTD#AP NEWS#CHITOOR DISTRICT#MP GALLA JAYADEV
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info