thesakshi.com : సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అంబటి రాంబాబు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పడిన ప్రతీసారి అంతకంటే వేగంగా లేచి నిలబడడం అంబటి నైజం. అనర్గళంగా మాట్లాడడం అంబటికి ఉన్న వరం. ఎంతటి కఠిన విషయమైనా సరే, విడమరిచి చెప్పడం ఆయన ప్రత్యేకత. విపక్షంపై ఎదురుదాడి చేయాలంటే అంబటి తర్వాతే ఎవరైనా.
వ్యక్తిగతంగా అంబటిని లక్ష్యంగా చేసుకుని ఎన్ని దాడులు వచ్చినా.. కఠినంగా వాటిని తట్టుకుని నిలబడ్డారు అంబటి. తనకు అప్పగించిన ఏ బాధ్యతనయినా నూటికి నూరు శాతం నెరవేర్చడంలో పరిపాటి అంటారు అంబటి గురించి తెలిసిన వాళ్లు. పార్టీ అధికార ప్రతినిధిగా కూడా అంబటి బలమైన గళం వినిపించారు.
వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇప్పుడు మంత్రయ్యారు. అసలు రోజా కు మంత్రి పదవి రాదని అటు పార్టీ, ఇటు ప్రభుత్వంలోని వారంతా గట్టిగా చెప్పినా.. ఆ ప్రచారాన్ని ఆమె పటాపంచలు చేశారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సీఎం జగన్ ఆమెకు టూరిజం, సాంస్కృతిక శాఖ బాధ్యతలను అప్పగించారు.
వైసీపీ ఫైర్ బ్రాండ్స్ ఇప్పుడు మంత్రులయ్యారు. మూడేళ్ల నిరీక్షణ తరువాత చివరి నిమిషంలో వారికి మంత్రి పదవులు దక్కాయి. సీఎం జగన్ 2024 ఎన్నికల కేబినెట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 11 మంది పాత మంత్రులు..14 మంది కొత్త వారితో కేబినెట్ ప్రమాణ స్వీకారం జరిగింది. మంత్రులకు శాఖల సైతం అప్పగించారు. అయితే, ఈ సారి కేబినెట్ లో రోజా..అంబటి రాంబాబు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరు కొత్త మంత్రులకు అదనపు బాధ్యతలు తీసుకుంటున్నారు.
టీడీపీ – పవన్ కళ్యాణ్ పైన వారిద్దరూ చేసే విమర్శలు – పంచ్ లకు వైసీపీ అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. గత కేబినెట్ లో టీడీపీ పైన కొడాలి నాని – పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ పేర్ని నాని.. మంత్రి అనిల్ కుమార్ లు అసెంబ్లీలో – బయటా తమ వాయిస్ బలంగా వినిపించే వారు. ఇక, అసెంబ్లీకి ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. తనను అసెంబ్లీలో చూడకూడదని చంద్రబాబు భావించారని..అటువంటి వ్యక్తి ముందే రెండు సార్లు శాసనసభకు వచ్చానని రోజా పదే పదే చెప్పుకొస్తున్నారు. ఇక, ఇప్పుడు తాను మంత్రి అయినా..చంద్రబాబు సభలో లేకపోవటం పైనా ప్రస్తావిస్తున్నారు. అయితే..ఇప్పటికే ఏపీలో రాజకీయంగా వాతావరణం హీటెక్కుతోంది.
సీఎం జగన్ సైతం రంగంలోకి దిగారు. చంద్రబాబు – ఆయన దత్తపుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్ గురించి పరోక్షంగా విమర్శలు ప్రారంభించారు. ఇదే సమయంలో పవన్ సైతం తనను దత్తపుత్రుడు అని పిలిస్తే…సీబీఐ దత్తపుత్రుడు అని అనాల్సి ఉంటుందంటు తెలిపారు . ఇక,కొడాలి నాని సభలో టీడీపీ పైన పోషించిన పాత్ర ఇక రోజా తీసుకోనున్నారు. అదే విధంగా అంబటి రాంబాబు తన దైన శైలిలో చంద్రబాబు -టీడీపీ నేతలను కార్నర్ చేసే బాధ్యతలకు సిద్దంగా ఉన్నారు. ప్రస్తుత కేబినెట్ లో ప్రభుత్వం పైన ప్రతిపక్షాల విమర్శాలను తిప్పి కొట్టే బాధ్యతలను ప్రధానంగా రోజా – అంబటి రాంబాబు తో పాటుగా గుడివాడ అమర్నాధ్ తీసుకోనున్నారు. ఇప్పటికే మంత్రిగా బాధ్యతలు చేపడుతూనే గుడివాడ అమర్నాధ్ జనసేన అధినేత పైన రాజకీయంగా గురి పెట్టారు. ఇక, నుంచి పేర్ని నాని బాధ్యతలు జనసేన విషయంలో గుడివాడ తీసుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది.