thesakshi.com : తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి-చింతూరు ఘాట్ రోడ్డులో సోమవారం ఉదయం భద్రాచలం నుంచి కాకినాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వలమూరు వద్ద ఎదురుగా ఛత్తీస్‌గఢ్‌కు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ రామకృష్ణ, కండక్టర్ రమేష్ సహా ఇరవై రెండు మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను మారేడుమిల్లి పీహెచ్‌సీకి తరలించారు.
అక్కడ ప్రథమ చికిత్స అనంతరం రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మారేడుమిల్లి పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.