thesakshi.com : నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు తితిదే బోర్డు సభ్యులుగా నియమించడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
తితిదే బోర్డు సభ్యులుగా నేరచరిత్ర ఉన్న వారిని నియమించారంటూ భాజపా నేత భానుప్రకాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి ఏదో లబ్ధి జరగడం వల్లే ఇలా చేస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది.
న్యాయవాది వాదనల్లో ప్రాథమిక సాక్ష్యాలున్నట్లు భావిస్తున్నామన్న ధర్మాసనం.. అందరినీ తొలగించకపోయినా కొందరినైనా తొలగించాలని సూచించింది. విధానపరమైన నిర్ణయం కాబట్టి దీనిని సమర్థిస్తున్నట్లు పేర్కొంది.