thesakshi.com : అమరావతి- సీఆర్డీఏ చట్టాన్ని పునరుద్ధరిస్తూ శాసనసభలో బిల్లు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం
ఏపీ పాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి చట్టం రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి
అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీని తక్షణం రద్దు చేస్తున్నట్టు శాసనసభలో ప్రకటించిన ప్రభుత్వం
గతంలో రద్దు చేసిన సీఆర్డీఏ చట్టాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ బిల్లు ను పెట్టిన మంత్రి బుగ్గన
ఏఎంఆర్డీఏకు బదలాయించిన ఆస్తులు, ఉద్యోగులను తిరిగి సీఆర్డీఏకు బదిలీ చేస్తున్నట్టు బిల్లులో ప్రస్తావించిన ప్రభుత్వం
భాగస్వాములతో పూర్తిస్థాయి సంప్రదింపులు జరపకపోవటం, శాసనమండలి లో బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లటం వంటి అంశాలు వికేంద్రీకరణ చట్టాన్ని వెనక్కు తీసుకోడానికి కారణాలుగా తెలిపిన ప్రభుత్వం
వికేంద్రీకరణపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరముందని భావిస్తున్నట్టు శాసనసభకు ఇచ్చిన ప్రకటనలో పేర్కోన్న ప్రభుత్వం.
తక్షణమే సీఆర్డీఏ చట్టం 2014 అమల్లోకి వస్తుందని వికేంద్రీకరణ చట్ట ఉపసంహరణ బిల్లులో పేర్కోన్న ప్రభుత్వం
1) రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకూ న్యాయం చేసేలా మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే, ఈ రోజుకు దాని నుంచి మంచి ఫలితాలు ఈ పాటికే అందుబాటులోకి వచ్చేవి. నాటి శ్రీబాగ్ ఒడంబడిక స్పూర్తితో, వెనకబడ్డ ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలూ కూడా సమాన అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో వికేంద్రీకరణ బిల్లుల్ని ప్రవేశపెట్టటం జరిగింది.
2) గతంలో కేంద్రీకరణ ధోరణలు, వీటిని ప్రజలు ఎంతగా వ్యతిరేకించారో, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్తమయింది. మరోసారి హైదరాబాద్ లాంటి సూపర్ క్యాపిటల్ మోడల్ వద్దే వద్దని, అటువంటి చారిత్రక తప్పిదానికి ప్రభుత్వం పాల్పడరాదని ప్రజల తీర్పు స్పష్టం చేసింది. కాబట్టే వికేంద్రీకరణే సరైన విధానం అన్నది బలంగా నమ్మి అడుగులు ముందుకు వేశాం.
3) అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు… వీరందరి ఆశలూ ఆకాంక్షలూ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది కాబట్టే, వాటిని ఆవిష్కరించింది కాబట్టే, మన ప్రభుత్వానికి గడచిన ఈ రెండున్నరేళ్ళలో జరిగిన ఏ ఎన్నికల్ని తీసుకున్నా ప్రజలు మనసారా దీవిస్తూ వచ్చారు, ఈప్రభుత్వాన్ని.
4) అయితే, వికేంద్రీకరణకు సంబంధించి అనేక అపోహలు, అనేక అనుమానాలు, అనేక కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలు, దుష్ప్రచారాలు.. ఇలా ఈ రెండేళ్ల కాలంలో వీటినే ప్రచారాలు చేశారు. అందరికీ న్యాయం చేయాలన్న ప్రభుత్వ సదుద్దేశాన్ని పక్కనపెట్టి, కొందరికి అన్యాయం జరుగుతుందన్న వాదననుకూడా కొంతమంది ముందుకు తోయడం కూడా మన కళ్లతో చూశాం.
5) ఈ నేపధ్యంలో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లుల్లోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్టపరంగాగానీ, న్యాయపరంగాగానీ అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరచేందుకు, బిల్లుల్ని మరింత మెరుగుపరిచేందుకు, అన్ని ప్రాంతాలకు, అందరికీ, విస్తృతంగా వివరించేందుకు ఇంకా ఏవైనా మార్పులు అవసరమైతే వాటినికూడా పొందుపరిచేందుకు, ఇంతకముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని, ఇంతకుముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని, మళ్లీ పూర్తి, సమగ్రమైన, మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది.
6. విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం.
మూడు రాజధానుల బిల్లును మెరుగుపరుస్తాం
పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లును తెస్తాం
ఇంతకు ముందు ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ, CRDA రద్దు బిల్లులను వెనక్కి తీసుకుంటున్నాం
విస్తృత, విశాల ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం
కొత్త బిల్లుపై అన్ని వర్గాల ప్రజలను ఒప్పిస్తాం.
1953 నుంచి 56 వరకు ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు ఉండేది
గుంటూరులో హైకోర్టు ఉండేది
గత చంద్రబాబు ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఉల్లంఘించింది
నా ఇల్లు ఇక్కడే ఉంటుంది.. ఈ ప్రాంతం అంటే నాకు ప్రేమ – ఈ ప్రాంతం అటు గుంటూరు కాదు.. ఇటు విజయవాడ కాదు
ఈ ప్రాంతంలో రోడ్డు, కరెంట్, నీళ్లు లాంటి కనీస అవసరాలు చేయడానికైనా లక్ష కోట్లు ఖర్చు అవుతుందని గత ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి
మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే ఒక సిటీ ఎప్పటికి వస్తుంది – చదువుకున్న వారి పిల్లలు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి పెద్ద నగరాలకు వెళ్లాల్సిందేనా?
విశాఖ రాష్ట్రంలో పెద్ద నగరం
విశాఖలో రోడ్లు, డ్రైనేజీ లాంటి కనీస సదుపాయాలు అన్నీ ఉన్నాయి – విశాఖపై దృష్టిపెట్టి అభివృద్ధి సుందరీకరణ చేస్తే.. వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్ తో పోటీ పడే నగరంగా ఎదుగుతుంది
అన్నీ ప్రాంతాలు అభివృద్ధి జరగాలనే విశాఖలో పరిపాలన రాజధాని, విజయవాడలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని పెట్టాలనుకున్నాం
మూడు రాజధానులపై రకరకాల అపోహలు, రకరకాల న్యాయ చిక్కులు సృష్టిస్తున్నారు – మూడు రాజధానులు ప్రారంభమై ఉంటే వాటి ఫలాలే ఇప్పటికే ప్రారంభమయ్యేవి
బిల్లులను మరింత మెరుగుపరుస్తాం
అన్ని వర్గాల ప్రజలను ఒప్పిస్తాం ఇంతకుముందు పెట్టిన బిల్లును వెనక్కి తీసుకుంటున్నాం – మళ్లీ సమగ్రమైన బిల్లును సభలో ప్రవేశపెడతాం.