thesakshi.com : వెలగపూడిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం. ఈ భేటీలో 36 అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది ప్రస్తుత మంత్రులకు ఇదే చివరి కేబినెట్ భేటీ కావడం గమనార్హం. మరోవైపు మంత్రులు తమ మంత్రి పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని, వారి వెంట ఖాళీ లెటర్‌హెడ్‌లను తీసుకెళ్లారని సమాచారం. కేబినెట్ సమావేశం తర్వాత మొత్తం 24 మంది మంత్రులు రాజీనామా చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రులు కొలువు తీరేందుకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 11వ తేదీ ఉదాయన్నే మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే వారికి అవకాశం కల్పించడంలో భాగంగా.. ప్రస్తుత మంత్రులంతా కాసేపట్లో రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే చివరి కేబినెట్ సమావేశానికి హాజరైన మంత్రులంతా తమ వెంట రాజీనామా లేఖలు కూడా తెచ్చుకున్నారు.. సీఎం జగన్ అదేశించిన వెంటనే.. మీటింగ్ ముగియగానే వారంతా స్వచ్ఛందంగా రాజీనామా లేఖలు సీఎం కు ఇవ్వనున్నారు. ఆ తరువాత జీఏడీ అధికారులు ా లేఖను గవర్నర్ కు ఇవ్వనున్నారు. రేపు గవర్నన్ భిశ్వభూషన్ తో సీఎం జగన్ మోహన్ రెడ్డి భేటీ అవుతారు. మంత్రుల రాజీనమాలకు కారణాలు.. కొత్త మంత్రి వర్గ విస్తరణ.. వారి జాబితాను గవర్నర్ కు అందించనున్నారు. అలాగే 11వ తేదీన కేబినెట్ విస్తరణ ఉంటుందనే విషయాన్ని గవర్నర్ కు సీఎం జగన్ చెప్పనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటిలో 36 అంశాలపై మంత్రివర్గం చర్చించింది. మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే 24మంది మంత్రులు తమ రాజీనామా లేఖలను సీఎంకు అందజేసినట్టు సమాచారం.
మొత్తం మంత్రుల రాజీనామాలను గవర్నర్ విశ్వభూషణ్ కు పంపనున్నారు. ఈ రాత్రికి ఆయన ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈనెల 11న కొత్త మంత్రివర్గం కొలువుదీరనుంది.
మరోవైపు ఈనెల 11న కొత్త మంత్రిమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయంలోని రెండో బ్లాక్ ఎదుట ప్రమాణ స్వీకార వేదికను నిర్మించాలని నిర్ణయించారు.
ఇక చివరి కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. డిగ్రీ కాలేజీల్లో 574 టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జడ్పీల కాలపరిమితి ముగిసే వరకూ కొనసాగించేందుకు పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ డివిజన్లకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
రాజమండ్రిలో హోటల్ కమ్ కన్వెన్షన్ సెంటర్ కోసం ఏపీ టూరిజం కార్పొరేషన్ కు 6 ఎకరాలు ఉచితంగా కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
హెల్త్ హబ్ పథకం కింద రాజమండ్రి కర్నూలు విజయనగరం అనంతపురం శ్రీకాకుళం జిల్లాల్లో ఆసుపత్రుల నిర్మాణానికి భూ కేటాయింపులపై కేబినెట్ ఆమోదం తెలిపింది.