THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

రాష్ట్రంలో 26 జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం

thesakshiadmin by thesakshiadmin
April 2, 2022
in Latest, Politics, Slider
0
రాష్ట్రంలో 26 జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం
0
SHARES
800
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com    :    ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ పూర్తయిన రోజే కొత్త జిల్లాల కు కలెక్టర్లనూ నియమించారు. మొత్తం 26 జిల్లాల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు శనివారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి.

అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గా సుమిత్ కుమార్, అనకాపల్లి జిల్లాకు రవి సుభాష్, కాకినాడ జిల్లాకు కృతికా శుక్లా, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా మాధవీలత, కోనసీమకు హిమాన్షు శుక్లా, పశ్చిమగోదావరి జిల్లాకు ప్రశాంతి, ఏలూరు జిల్లా కలెక్టర్ గా ప్రసన్న వెంకటేశ్, మన్యం కలెక్టర్ గా నిశాంత్ కుమార్ లను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. బదిలీల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జిల్లాల వారీగా కలెక్టర్లు వీరే..

శ్రీకాకుళం: శ్రీకేశ్‌ బాలాజీరావు

విజయనగరం: సూర్యకుమారి

మన్యం: నిశాంత్ కుమార్‌

విశాఖపట్నం: మల్లికార్జున

అల్లూరి సీతారామరాజు: సుమిత్‌ కుమార్‌

అనకాపల్లి: రవి సుభాష్‌

కాకినాడ: కృతికా శుక్లా

తూర్పు గోదావరి: మాధవీలత

కోనసీమ: హిమాన్షు శుక్లా

పశ్చిమ గోదావరి: పి.ప్రశాంతి

ఏలూరు: ప్రసన్న వెంకటేష్

కృష్ణా: రంజిత్‌ బాషా

ఎన్టీఆర్‌: ఎస్‌.దిల్లీరావు

గుంటూరు: వేణుగోపాల్‌రెడ్డి

పల్నాడు: శివ శంకర్‌

బాపట్ల: విజయ

ప్రకాశం: దినేష్ కుమార్

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు శనివారం నాడు ప్రక్రియ పూర్తైంది. వర్చువల్‌గా భేటీ అయిన కేబినెట్‌.. చిన్న చిన్న మార్పులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేయబోతోంది. జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ‘‘కొత్త జిల్లాల ఏర్పాటు ఒక చారిత్రక ఘట్టం.. వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నాం. కొత్త జిల్లాలకు సంబంధించి కసర్తతు పూర్తైంది. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్‌ ఎప్పుడైనా రావచ్చు. ఏప్రిల్‌ 4వ తేదీన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రారంభమవుతుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు జరిగింది’’ అని తెలిపారు.

కాగా, 26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లతో ఫైనల్‌ గెజిట్‌ సిద్దమైంది. ఈ క్రమంలో పలు మండలాలను ప్రభుత్వం మార్చింది. రెవెన్యూ డివిజన్ల సంఖ్య 51 నుండి 73కి పెరిగింది. పాత రెవెన్యూ డివిజన్‌లన్నీ యథాతథంగా కొనసాగనున్నాయి.

కొత్త జిల్లాల వారీగా రెవెన్యూ డివిజన్లు..

1. శ్రీకాకుళం జిల్లా : పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం

2. విజయనగరం : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం

3. ప్వార్వతీపురం మన్యం : పార్వతీపురం, పాలకొండ

4. అల్లూరి సీతారామరాజు : పాడేరు, రంపచోడవరం

5. విశాఖపట్నం : భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం

6. అనకాపల్లి : అనకాపల్లి, నర్సీపట్నం,

7. కాకినాడ : పెద్దాపురం, కాకినాడ

8. కోనసీమ : రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట (కొత్త)

9. తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం, కొవ్వూరు

10. పశ్చిమగోదావరి : నర్సాపురం, భీమవరం (కొత్త)

11. ఏలూరు : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు

12. కృష్ణా : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త)

13. ఎన్టీఆర్‌ : విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త)

14. గుంటూరు : గుంటూరు, తెనాలి

15. బాపట్ల : బాపట్ల (కొత్త), చీరాల (కొత్త)

16. పల్నాడు : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త)

(కొత్త)

18. నెల్లూరు : కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు

19. కర్నూలు : కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త)

20. నంద్యాల : ఆత్మకూరు (కొత్త), డోన్‌ (కొత్త), నంద్యాల

21. అనంతపురం : అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్‌ (కొత్త)

22. శ్రీ సత్యసాయి : ధర్మవరం, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి (కొత్త)

23. వైఎస్సార్‌ కడప : బద్వేల్, కడప, జమ్మలమడుగు

24. అన్నమయ్య : రాజంపేట, మదనపల్లె, రాయచోటి (కొత్త)

25. చిత్తూరు : చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త)

26. తిరుపతి : గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి (కొత్త), తిరుపతి.

కొత్త జిల్లాలు, మండలాల సంఖ్య..

– శ్రీకాకుళం జిల్లా.. 30 మండలాలు

– విజయనగరం జిల్లా.. 27 మండలాలు

– పార్వతీపురం మన్యం జిల్లా.. 15 మండలాలు

– అల్లూరి సీతారామరాజు జిల్లా.. 22 మండలాలు

– విశాఖపట్నం జిల్లా.. 11 మండలాలు

– అనకాపల్లి జిల్లా.. 24 మండలాలు

– కాకినాడ జిల్లా.. 21 మండలాలు

– కోనసీమ జిల్లా.. 22 మండలాలు

– తూర్పుగోదావరి జిల్లా.. 19 మండలాలు

– పశ్చిమగోదావరి జిల్లా.. 19 మండలాలు

– ఏలూరు జిల్లా.. 28 మండలాలు

– కృష్ణా జిల్లా.. 25 మండలాలు

– ఎన్టీఆర్ జిల్లా.. 20 మండలాలు

– గుంటూరు జిల్లా.. 18 మండలాలు

– బాపట్ల జిల్లా.. 25 మండలాలు

– పల్నాడు జిల్లా.. 28 మండలాలు

– ప్రకాశం జిల్లా.. 38 మండలాలు

– నెల్లూరు జిల్లా.. 38 మండలాలు

– కర్నూలు జిల్లా.. 26 మండలాలు

– నంద్యాల జిల్లా.. 29 మండలాలు

– అనంతపురం జిల్లా.. 31 మండలాలు

– శ్రీ సత్యసాయి జిల్లా.. 32 మండలాలు

– వైఎస్సార్ కడప జిల్లా.. 36 మండలాలు

– అన్నమ్మయ్య జిల్లా.. 30 మండలాలు

– చిత్తూరు జిల్లా.. 31 మండలాలు

– తిరుపతి జిల్లా.. 34 మండలాలు

రాష్ట్రంలో 26 జిల్లాలకు ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు

విశాఖ కమిషనర్‌గా సీహెచ్‌. శ్రీకాంత్ నియామకం

శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా జి.ఆర్‌.రాధిక నియామకం

విజయనగరం జిల్లా ఎస్పీగా ఎం.దీపిక కొనసాగింపు

పార్వతీపురం ఎస్పీగా వాసన విద్య సాగర్‌ నాయుడు నియామకం

అనకాపల్లి ఎస్పీగా గౌతమి సాలి నియామకం

అల్లూరి సీతారామరాజు ఎస్పీగా సతీశ్‌కుమార్ నియామకం

కాకినాడ ఎస్పీగా రవీంద్రనాథ్‌బాబు నియామకం

కోనసీమ జిల్లా ఎస్పీగా కె.ఎస్‌.ఎస్‌.వి. సుబ్బారెడ్డి నియామకం

తూ.గో. జిల్లా ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి నియామకం

ప.గో. జిల్లాగా ఎస్పీగా రవిప్రకాశ్‌ నియామకం

ఏలూరు జిల్లా ఎస్పీగా ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి నియామకం

కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ కొనసాగింపు

విజయవాడ కమిషనర్‌గా క్రాంతి రాణా టాటా కొనసాగింపు

గుంటూరు ఆర్బన్‌ ఎస్పీగా కె.ఆరీఫ్‌ హాఫీజ్‌ కొనసాగింపు

Tags: #Andhrapradesh#AP#APnewdistricts#apnews#cmjagan#governmentofandhrapradesh#newdistricts#YS JAGAN
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info