thesakshi.com : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బాబాయి, మాజీ మంత్రి డాక్టర్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును దాదాపుగా మూసేసినట్లేనని పులివెందుల ప్రజలు భావిస్తున్నారు. ఈ కేసు విచారిస్తున్న సీబీఐ అధికారులకు ఎవరూ సహకరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వివేకా హత్యకేసు విచారణ ఎంతకాలం పడుతుందో చెప్పాలంటూ న్యాయస్థానం కోరగా ఎవరూ సహకరించడంలేదని, బెదిరింపులకు గురవుతున్నామని, కాబట్టి ఈ కేసు విచారణ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమంటూ సీబీఐ పూర్తిగా చేతులెత్తేసినట్లు సమాచారం.
అధికార వ్యవస్థ కూడా తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. ?దీనివల్లే విచారణ ముందుకు సాగడంలేదని, నిందితులు బెయిల్ కావాలంటూ పిటిషన్ పెట్టుకున్నారని, వారు జైలు నుంచే సాక్షులను బెదిరిస్తున్నారని, వారికి ఎట్టి పరిస్థితుల్లోను బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ తరఫు న్యాయవాది న్యాయమూర్తిని ఈ సందర్భంగానే విచారణకు ఎంత సమయం పడుతుందని కోర్టుఅడిగిన ప్రశ్నకు సీబీఐ చేప్పలేమని స్పష్టం చేసింది.
అధికారులను బెదిరిస్తున్నా ఎవరూ చర్యలు తీసుకోవడంలేదని, సహకారం అందకపోవడంతో కేసు దర్యాప్తు ముందుకు సాగడం చాలా కష్టమని సీబీఐ తెలిపింది. సీబీఐ సమాధానంపై హైకోర్టు ఎలా స్పందిస్తుందోకానీ లక్ష సవాళ్లను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎదుర్కొంటోందని అర్థమవుతోంది. కడప సెంట్రల్ జైలు నుంచి వస్తున్న సీబీఐ అధికారుల కారును అడ్డగించి డ్రైవర్‌ను కొందరు వ్యక్తులు బెదిరించారు. కడప నుంచి, పులివెందుల నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీచేశారు. లేదంటే బాంబులేస్తామని బెదిరించిన సంగతి తెలిసిందే. దీనిపై డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
కేసు విచారణ ప్రారంభంలో పై నుంచి ఒత్తిడి కారణంగా నత్తనడకన సాగిన కేసు విచారణ సీబీఐ అధికారులకు బెదిరింపులు రావడంతో వారిలో పట్టుదలను పెంచింది. పై నుంచి వచ్చే ఒత్తిడిని కూడా పక్కనపెట్టి మరీ దూకుడుగా విచారణ చేశారు. కీలకమైన సాక్షులంతా అందుబాటులో ఉన్నారని కోర్టుకు తెలపడంతోపాటు పూర్తి సాక్ష్యాధారాలను కూడా సేకరించారు. దాదాపు కేసు పూర్తయిందని, రేపో, మాపో కీలక వ్యక్తులను అరెస్ట్ చేయడమే తరువాయి అంటూ ప్రచారం కూడా సాగింది. ఈ కేసులో కీలకంగా ఉన్న దస్తగిరి కూడా అప్రూవర్‌గా మారారు. ఫైనల్‌గా సీబీఐ అధికారులు కోర్టుకు చెప్పిన సమాచారం ప్రకారం సహకరించే ప్రభుత్వం ఉంటే నిందితులను పట్టుకోవడానికి సమయం పట్టదని స్పష్టం చేసినట్లైంది.