thesakshi.com : ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి కావటంతో..ఇక, ఎన్నికల వరకు ఎమ్మెల్యేలతో సహా.. పార్టీ శ్రేణులు ప్రజల్లోనే ఉండాలని సీఎం జగన్ నిర్దేశించారు.
నేరుగా గడప గడపకు ఎమ్మెల్యేలతో పాటు అధికారులను పంపిస్తే.. ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉంది. స్తానిక ఎమ్మెల్యేపై ఎంత వ్యతిరేకత ఉందన్నది ఒక క్లారిటీ వస్తుందని అంచనా వేస్తున్నారు.
అదే సమయంలో ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 95 శాతం హామీలను క్లియర్ చేసినట్లుగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాల కలెక్టర్లు ఖరారు చేసిన షెడ్యూల్‌ను అనుసరించి ఆయా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని ప్రతి ఇంటినీ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి ఎమ్మెల్యేలు సందర్శించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసారు. ఇక, కొద్ది రోజుల క్రితం సీఎం జగన్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వంతో పాటుగా ఎమ్మెల్యేల పని తీరు పైన క్షేత్ర స్థాయిలో సర్వేలు చేయించినట్లుగా తేల్చారు. అందులో ప్రభుత్వం పైన ప్రజల్లో సానుకూలత ఉండగా.. కొందరు ఎమ్మెల్యేల పైన మాత్రం వ్యతిరేకత ఉన్నట్లుగా తేలింది.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటుగా… ఆ ఇంటికి అందుతున్న పథకాలు..లబ్ది గురించి తెలుసుకోనున్నారు. పథకాలు అందించడంతో పాటు.. ప్రతి ఇంటికీ జగన్ రాసిన లేఖను ఎమ్మెల్యే అందించనున్నారు. ప్రతిపక్షాలు.. మీడియా నుంచి వస్తున్న విమర్శలను తిప్పి కొట్టాలి.. ప్రజలకు వాస్తవం తెలిసేలా చేయాలి అంటే ఇదే సరైన మార్గమని అధినేత భావిస్తున్నారు. అందుకే విపక్షాల ఆరోపణలను సైతం ఖండిస్తూ లబ్ది దారులకు తమ లక్ష్యాలను వివరించనున్నారు. పార్టీ పరంగా తొలుత భావించిన ఈ కార్యక్రమంలో అధికారులు భాగస్వామ్యం ఉండేలా ప్రణాళికలు సిద్దం చేసారు. కేవలం ఎమ్మెల్యేలే అంటే ఫీడ్ బ్యాక్ ర్యాంగ్ గా వచ్రే ప్రమాదం ఉందని.. అందుకే అధికారులను భాగం చేశారు.
ఇంటింటికీ వైసీపీ అని.. ఎమ్మెల్యేలతో పాటు అధికారులను పంపిస్తే.. అది మరింత వివాదాస్పదమయ్యే ప్రమాదం ఉంది. అందుకే వివాదాలకు అవకాశం లేకుండా దీనిని ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా మార్చుతూ ఉత్తర్వులు ఇచ్చారు. సీఎం జగన్ అధికారంలోకి రాక ముందు ఇచ్చిన హామీల్లో ఎంత శాతం అమలు అయ్యాయన్న విషయంలో ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. అదే సమయంలో ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 95 శాతం హామీలను క్లియర్ చేసినట్లుగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాల కలెక్టర్లు ఖరారు చేసిన షెడ్యూల్‌ను అనుసరించి ఆయా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని ప్రతి ఇంటినీ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి ఎమ్మెల్యేలు సందర్శించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడిస్తే..ఇక, టీడీపీ ఉండదనేది వైసీపీ నేతల అంచనా. ఎమ్మెల్యేల పనితీరు మెరుగు పరుచుకుంటేనే..వారి గ్రాఫ్ పెరిగితేనే టిక్కెట్లు వస్తాయని సీఎం స్పష్టంగా చెప్పారు. గ్రాఫ్ పెరగని వారికి టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. అయితే, ఏ ఎమ్మెల్యేలు ఆశించిన స్థాయిలో పని చేయటం లేదనేది వెల్లడించలేదు.
ప్రాంతీయ సమన్వయకర్తల ద్వారా ఆ ఎమ్మెల్యేలు పని తీరు మెరుగు పరచుకొనే విధంగా సూచనలు చేయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ప్రాంతీయ – జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న వారు పార్టీ ఎమ్మెల్యేలతో సమీక్షలు చేస్తున్నారు. ఈ రోజు ప్రారంభం అయ్యే గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమ నిర్వహణపైన ప్రతీ రోజూ సీఎం కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసారు. దీంతో..ఇప్పుడు ఈ కార్యక్రమం వైసీపీ ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్ కు కీలకంగా మారనున్నాయి.