thesakshi.com : ఆటో లారీ ఢీ. ఒకరు మృతి..10 మంది వ్యవసాయ కూలీలకు గాయాలు..
తాడిపత్రి రూరల్ పరిధిలోని చుక్కలూరు క్రాస్ వద్ద నిలిచి ఉన్న లారీని ఆటో ఢీకొనడంతో ఒక మహిళ మృతి చెందినట్లు సమాచారం… మరో పది మంది వ్యవసాయ కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి… వీరంతా గంగాదేవి పల్లి గ్రామానికి పత్తి కోసేందుకు వెళ్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి… లోడుకు మించి కూలీలను ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్లాడు…. పామిడి వద్ద ఘోర దుర్ఘటన మరవకముందే ఈ సంఘటన చోటు చేసుకోవడం విషాదకర విషయం..