thesakshi.com : బండ్ల గణేష్ ట్వీట్స్ కి ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు రిప్లై ఇచ్చారు. ఆకులూ, వక్కలు, పక్కలు ఇదేగా నీ బ్రతుకంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ఎవరో చెప్పారని పిచ్చి కుక్కలా అరుస్తున్నావు. నువ్వు ఎంత అరిచినా నీరసం రాబవడం తప్పితే బండ్లు ఓడలు కావు గణేశా అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంపీ విజయ సాయి రెడ్డి ట్వీట్ సోషల్ మీడియాలో సంచలంగా మారింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే విజయ సాయి రెడ్డి ప్రత్యర్థులపై తన మార్కు ట్వీట్స్ తో విరుచుకుపడుతూ ఉంటారు.
విజయ్ సాయి రెడ్డి ఆయన ట్వీట్ లో… ”ఆకులు..వక్కలు..పక్కలు…ఇదేగా నీ బతుకు! అంతే ఈజీ అనుకున్నావా ఎవరిని పడితే వాళ్లను కరవడం? ఎవడో ఉస్కో అనగానే పిచ్చి పట్టిన వీధి కుక్కలా ఎగిరెగిరి మొరుగుతున్నావ్. మొరిగి మొరిగి సొమ్మసిల్లినా ఓడలు బండ్లవుతాయి గాని, బండ్లు ఓడలు కావు. అయ్యో…గణేశా!” అంటూ కామెంట్ చేశారు. విజయ సాయి రెడ్డి ఈ స్థాయిలో కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
వెన్నుపోటు పేటెంటు నీ యజమాని చంద్రబాబుది. 28 ఏళ్లుగా చెక్కు చెదరని గిన్నెస్ రికార్డు. ఇంకో వందేళ్లయినా అది బాబు పేరనే ఉంటుంది. ఇంత చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లా బండ్లా? ప్రతి కుక్కా సింహం కావాలనుకుటుంది. నీలాంటి వాడే భౌ..భౌమని మొరిగి గర్జించా అనుకుని మురిసిపోతుంటాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 16, 2022
ఒక్కసారిగా ఎంపీ విజయసాయిరెడ్డిపై విరుచుకుపడుతున్న బండ్ల గణేశ్ ఎవరికోసం.కమ్మజాతిని కించపరిచారు అనే వ్యాఖ్యల నుంచి రాజకీయాల వరకు రకరకాల ట్వీట్స్ తో నిన్నట్నుంచి విజయసాయిపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. సడెన్ గా ఆయన ఎందుకు విజయసాయిపై పడ్డారు? ఇది ఆయన వ్యక్తిగత ఎజెండా. ఆయన స్వార్థం ఆయనది. ఆయన స్వలాభం ఆయనది. ఆయన లక్ష్యం వేరు. ఇలాంటి విమర్శలు, ఆరోపణలకు విజయసాయి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ స్థాయిబేధం చూసుకోవాలి.
విజయసాయి ఎవరు.. బండ్ల గణేశ్ ఎవరు.. అనే విషయాన్ని ప్రశ్నించుకుంటే అసలు బండ్ల ట్వీట్స్ కు విజయసాయి స్పందించాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఈజీగా బోధపడుతుంది. కానీ ఆయన స్పందించారు. తన స్థాయిని తానే దిగజార్చుకున్నారు.
ఏపీ రాజకీయాలతో బండ్ల గణేశ్ కు ఎలాంటి సంబంధం లేదు. ఆయనకు రాజకీయ స్నేహితులు ఉండొచ్చు కానీ రాజకీయాలతో సంబంధం లేదు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం ఆయన ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి కూడా కాదు. ఆయన ఇల్లు తెలంగాణలో ఉంది. వ్యాపారాలు ఎక్కువగా తెలంగాణలోనే ఉన్నాయి. చివరికి ఆయన ఆధార్ కార్డు, ఓటరు కార్డు కూడా తెలంగాణవే.
బ్రోకర్లు, తార్పుడుగాళ్లు, మోసగాళ్లు, జేబులు కొట్టేవాళ్ళు ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళని విమర్శిస్తే పెద్దోళ్లు అయిపోతామని భ్రమపడుతుంటారు. బండ్లలాగా. ఎన్నిసార్లు తన్నులు తిన్నది, ఎవరెవరి కాళ్లుపట్టుకున్నదీ అతని జాతకం లైట్ బోయ్ నుంచి అందరికీ తెలుసు. కుక్కకాటుకు చెప్పుదెబ్బలు తప్పవు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 16, 2022
బ్రోకర్లు, తార్పుడుగాళ్లు, మోసగాళ్లు, జేబులు కొట్టేవాళ్ళు ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళని విమర్శిస్తే పెద్దోళ్లు అయిపోతామని భ్రమపడుతుంటారు.. బండ్లలాగా. ఎన్నిసార్లు తన్నులు తిన్నది, ఎవరెవరి కాళ్లుపట్టుకున్నదీ అతని జాతకం లైట్ బోయ్ నుంచి అందరికీ తెలుసు. కుక్కకాటుకు చెప్పుదెబ్బలు తప్పవని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు ఎంపీ విజయసాయి రెడ్డి.