THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

మాజీ మంత్రి నారాయణ అరెస్టు వెనక..?

thesakshiadmin by thesakshiadmin
May 11, 2022
in Latest, Politics, Slider
0
మాజీ మంత్రి నారాయణ అరెస్టు వెనక..?
0
SHARES
95
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com    :    మాజీ మంత్రి నారాయణని పోలీసులు అరెస్టు చేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు వెంటనే లేఖ రాశారు. నారాయణ అరెస్ట్ రాజకీయ కక్షతో జరిగిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి చిత్తూరు తరలింపులో జాప్యం వెనుక దురుద్దేశ్యం ఉందన్నారు. రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ సమయం జరిగిన ఉదంతాన్ని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. పేపర్ లీకేజీ కేసులో అదనపు సెక్షన్‌లు జోడించి అక్రమ అరెస్ట్ కు పాల్పడ్డారని పేర్కొన్నారు. చిత్తూరు SP వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే అధికారి అని వెంటనే ఘటనపై జోక్యం చేసుకుని న్యాయం చెయ్యాలని కోరారు. కేంద్ర హోం మంత్రితో పాటు రాష్ట్ర గవర్నర్‌కి కూడా చంద్రబాబు లేఖ రాసారు.

కొందరి విషయంలో చూస్తే ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారో అనిపిస్తుంది. నారాయణ విద్యా సంస్థలకు అధినేత. ఆయనకు మంత్రి కాక ముందు కూడా ఏపీలో పేరు బాగా ఉంది. ఆయన స్థితిమంతుడు అంగబలం కూడా మెండుగా ఉన్నవాడు దాంతో తటస్థుల కోటాలో ఆయన్ని రాజకీయాల్లోకి 2014లో టీడీపీ అధినాయకుడు చంద్రబాబు తెచ్చారు.

ఆయనను కీలకమైన శాఖకు తొలి పర్యాయమే మంత్రిని చేశారు. చంద్రబాబు భుజానికెత్తుకున్న అమరావతి రాజధానికి మొత్తం నారాయణే అన్నట్లుగా కధ సాగించారు. మొత్తానికి చూస్తే అయిదేళ్ళ పాటు మునిసిపల్ మంత్రిగా ఎంతవరకూ స్వేచ్చగా వ్యవహరించారో ఎవరికీ తెలియదు కానీ అమరావతి రాజధాని బినామీ కధలు భూ భాగోతాలు ఇలా చాలా తెర వెనక ముందూ ఆరోపణలలో మాత్రం ఆయన పేరు ప్రత్యర్ధులు తెచ్చేశారు.

లేటెస్ట్ గా నారాయణను అరెస్ట్ చేసింది టెన్త్ పేపర్స్ లీక్ విషయంలోనే అయినా ఆయన మీద అమరావతి రాజధాని కేసు బలంగా చుట్టుకోబోతోంది. ఈ కేసు విషయంలో వైసీపీ సర్కార్ గట్టి పట్టుదలగా ఉంది. అదే టైమ్ లో చూసుకుంటే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఓ కేసు నమోదు అయింది.

ఇక అమరావతి రాజధాని విషయంలో చూస్తే 2014 నుంచి 2019 మధ్యలో జరిగిన భూ సేకరణలో ఎన్నో అవకతవకలు జరిగాయని ఇప్పటికీ వైసీపీ ఆరోపిస్తూ వస్తోంది. దీని మీద మూడేళ్ళుగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఈ విషయంలో భూసేకరణలలో వచ్చిన ఆరోపణలు అలాగే ఉండిపోయాయి.

ఇక నారాయణను మొదట్లోనే ఈ కేసు విషయాన అరెస్ట్ చేస్తారు అని అంతా అనుకున్నారు. కానీ నాడు ఆయనను ఎందుకో వదిలేసినట్లుగా అనిపించినా ఇపుడు మాత్రం గట్టిగానే కేసులు పెట్టేలా సీన్ కనిపిస్తోంది. టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజ్ విషయం కూడా సీరియస్ మ్యాటరే అయినా దీని కంటే పెద్ద మ్యాటర్ అమరావతి రాజధాని భూముల కధ. దాంతో అక్కడ కేసులతో పాటు మరిన్ని కేసులు కూడా ఈ మాజీ మంత్రి చుట్టూ అల్లుకునేలా ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి నారాయణ రాజకీయాల మీద విరక్తి చెందారో మరేమో తెలియదు కానీ మూడేళ్ళుగా యాక్టివ్ గా లేరు.

ఆ మధ్యన ఆయన పుట్టిన రోజు సందర్భంగా అంతా రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నా కూడా ఆయన సున్నితంగా నో చెప్పారు అని ప్రచారం జరిగింది. అయినా గత కాలపు మంత్రి వైభోగం దానికి మించి చంద్రబాబు సాన్నిహిత్యం ఇపుడు ఈ మాజీ మంత్రిని టార్గెట్ అయ్యేలా చేశాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags: #Andhrapradesh news#NARA CHANDRA BABU NAIDU#narayana#narayana colleges#TDP
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info