THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

బిగ్ బాస్ సీజన్ 5 స్పందించిన మెగా బ్రదర్

thesakshiadmin by thesakshiadmin
September 11, 2021
in Latest, Movies
0
బిగ్ బాస్ సీజన్ 5 స్పందించిన మెగా బ్రదర్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com   :   తెలుగు బుల్లి తెరపై షేక్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 పై ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ప్రతి సీజన్ మాదిరిగానే ఈ సీజన్ కూడా సెలబ్రెటీలు ప్రముఖులు ఫాలో అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా నాగబాబు బిగ్ బాస్ సీజన్ 5 స్పందించాడు. ఈ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో నాగబాబు కు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు.. ఎవరికి మెగా బ్రదర్ సపోర్ట్ గా నిలుస్తున్నాడు అనే విషయంలో క్లారిటీ ఇచ్చాడు.

ఆయన స్వయంగా ఒక వీడియోను విడుదల చేసి మరీ నాగబాబు తన సపోర్ట్ ను ప్రకటించాడు. జబర్దస్త్ కమెడియన్ తేజా గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి.. ఆ తర్వాత ఆపరేషన్ తో ట్రాన్స్ జెండర్ గా మారి ప్రియాంక పేరుతో బిగ్ బాస్ లో అడుగు పెట్టిన ఆమెకు నాగబాబు మద్దతు తెలియజేశాడు. ప్రియాంకగా మారిన సమయంలో చాలా ఇబ్బందులకు గురి అయ్యింది. ఆ సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లి పోతే నా వంతుగా నేను తనకు సహకారం అందించి మోటివేట్ చేసేలా ప్రయత్నాలు చేశాను అన్నాడు.

ఈసారి బిగ్ బాస్ లో నాకు తెలిసిన వారు నచ్చిన వారు చాలా మందే ఉన్నారు. యాంకర్ రవి.. షణ్ముఖ్.. ప్రియ.. నటరాజ్ మాస్టర్.. యానీ మాస్టర్ లు అంటే నాకు ఇష్టం. వారితో నాకు సన్నిహిత సంబంధం ఉంది. మరి కొందరితో పరిచయం కూడా ఉంది. అందరూ కూడా మంచి వారు.. మనుషులకు మంచి గౌరవం ఇచ్చే వారు ఉన్నారు. అయితే నా మద్దతు మాత్రం ఈసారి ప్రియాంకకు అంటూ నాగబాబు స్పష్టంగా చెప్పేశాడు.

తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో సమస్యలు ఇతరులు కూడా ఎదుర్కొంటున్నారు కనుక వారికి మార్గదర్శంగా నిలవాలనే ఉద్దేశ్యంతో ప్రియాంక తీసుకున్న నిర్ణయం అభినందనీయం అంటూ నాగబాబు చెప్పుకొచ్చాడు. ఊగిసలాట జీవితంను వదిలేసిన ప్రియాంకను కొందరు మొదట విమర్శించిన ఆ తర్వాత అంతా కూడా సమర్థించారు.

బిగ్ బాస్ లో ప్రియాంక జర్నీ ఎలా ఉంటుందో నేను చెప్పలేను. కాని అక్కడ వరకు వెళ్లడమే చాలా పెద్ద విషయం. ప్రియాంక కెమెరా ముందు ఎలా ఉంటుందో కెమెరా లేకుండా కూడా అలాగే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. జబర్దస్త్ లో ఆఫర్లు లేని సమయంలో నేను షో ప్రారంభిస్తే అందులో ఛాన్స్ ఇప్పించాను. ఆ తర్వాత సొంతంగానే యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని కెరీర్ లో ముందుకు సాగుతుంది. ఖచ్చితంగా ప్రియాంక చాలా ఆదర్శం అనడంలో సందేహం లేదు.

అందుకే ఆమెకు నాగబాబు మద్దతుగా నిలుస్తున్నాడు. ప్రియాంక ఎలిమినేషన్ లో ఉన్న సమయంలో ఖచ్చితంగా నాగబాబు నుండి మద్దతు ఉన్న కారణంగా మెగా ఫ్యాన్స్ నుండి మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయంటూ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

Tags: #Bigg Boss 5#MEGA BROTHER#NAGABABU#TELUGU BIGG BOSS#TRANSGENDER PRIYANKA
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info