thesakshi.com : • లాలూ, నితీష్ పరిపాలనలో బీహార్ అత్యంత వెనుకబడిన రాష్ట్రం గా మిగిలిపోయింది.
• రాబోయే పది, పదిహేను ఏళ్లలో బీహార్ “ప్రగతిశీల రాష్ట్రంగా” ఎదగాలంటే ఇప్పుడున్న దారిలో వెళితే సాధ్యం కాదు.
• కొత్త ఆలోచన, కొత్త ప్రయత్నం ద్వారానే ఇది సాధ్యం.
• ప్రజలంతా కలసికట్టుగా అడుగు ముందుకేస్తే ఈ దురవస్థ నుంచి బయటపడతాం.
• ఎలాంటి రాజకీయ పార్టీ, రాజకీయ వేదికను నేను ఇప్పుడు ప్రకటించను.
• “జన్ సురాజ్” కోసం రాబోయే 3, 4 నెలలో అందరినీ కలిసి మాట్లాడుతాను.
• నా అభిప్రాయం తో కలిసి వచ్చే వారిని ఈ బృహత్తర ఉద్యమంలో చేర్చుకుంటాం.
• నేను రాజకీయ పార్టీ పెడితే అది కేవలం ప్రశాంత్ కిషోర్ పార్టీ కాదు, అందరి పార్టీ గా ఉంటుంది.
• బీహార్ ప్రజల సమస్యలు , వారి ఆకాంక్షలను తెలుసుకుంటాను.
• అక్టోబర్ 2 న “చంపారన్ నుంచి 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర” ను ప్రారంభిస్తాను.
• ఏడాదిలోగా అందరినీ కలుసుకునేందుకు ప్రయత్నం చేస్తాను.
• “జన్ సురాజ్” ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరతాను.
• రాష్ట్ర ప్రజాసమస్యలు తెలుసుకుంటాను.
• నా శక్తి సామర్థ్యాలు అన్నిటినీ ఇందుకోసం ఉపయోగిస్తాను.
• మధ్యలో వదిలి ఎక్కడికి వెళ్ళను.