thesakshi.com : మెగాస్టార్ బర్త్ డే వేడుకల్లో మెగాబ్రదర్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపించి సందడి చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి-పవన్ కల్యాణ్ ని ఒకే ఫ్రేమ్ లో చూసుకుని మెగాభిమానులు మురిసిపోయారు. దాంతో పాటే 66 ఏజ్ లో చిరు చిరంజీవి.. 50 వయసులో పవన్ కల్యాణ్ చేస్తున్న హార్డ్ వర్క్ ప్రముఖంగా చర్చకు వచ్చింది.
అన్నదమ్ములిద్దరు ప్రస్తుతం చేరో అరడజను సినిమాలు చేస్తున్నారు..! చిరంజీవి దాదాపుగా నాలుగు సినిమాలను ఖరారు చేసి చకచకా షూటింగులు చేసేస్తున్నారు. ప్లాన్ లో వేగం పెంచారు. మరో నలుగురు దర్శకుల కథల్ని కూడా ఓకే చేసి ప పీకే కూడా ఇదే ఫ్లోలో ఉన్నాడు. పింక్ తర్వాత `హరిహర వీరమల్లు` చిత్రాన్ని వేగంగా పూర్తి చేస్తున్న పవన్ తదుపరి సురేందర్ రెడ్డి.. హరీష్ శంకర్ సహా పలువురు దర్శకులతో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
2020 కరోనా క్రైసిస్ మొదటి వేవ్ సమయంలోనే నాలుగు స్క్రిప్ట్ లను ఫైనల్ చేసి తనతో పని చేసే నలుగురు దర్శకులను మెగాస్టార్ చిరంజీవి పరిచయం చేశారు. అందులో కొరటాల శివతో ఆచార్య చిత్రీకరణ పూర్తయింది. రిలీజ్ ప్రమోషన్స్ ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటికే మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్ `గాడ్ ఫాదర్` (చిరు 153) ప్రారంభమైంది. తదుపరి వేదాళం రీమేక్ మెహర్ రమేష్ దర్శకత్వంలో 155వ సినిమాగా తెరకెక్కనుంది. చిరు బర్త్ డే వేళ ఈ సినిమా టైటిల్ భోళా శంకర్ అంటూ ప్రకటించారు.
బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 154 వ చిత్రంపైనా ఈ శనివారం అధికారికంగా ప్రకటన వెలువడింది. ఈ చిత్రం సముద్ర నేపథ్యంలో పూర్తి మాస్ స్టోరీతో తెరకెక్కనుందని తాజాగా రివీల్ చేసిన పోస్టర్ వెల్లడిస్తోంది. చిరంజీవి పూర్తి మాస్ అవతారంతో సర్ ప్రైజ్ ఇవ్వనున్నారు. ఈ సినిమాకి వాల్టేర్ వీరన్న టైటిల్ ప్రచారంలో ఉంది. టీమ్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇవేగాక చిరు క్యూలో పలువురు దర్శకులు స్క్రిప్టుల్ని వండుతూ బిజీగా ఉన్నారు.
పవన్ కల్యాణ్ `హరిహర వీరమల్లు` చిత్రీకరణ పూర్తి చేస్తూనే అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ `భీమ్లా నాయక్`ని వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ చిత్రంలో రానా ఒక కథానాయకుడిగా నటిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ పర్యవేక్షిస్తున్నారు.
తదుపరి గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించేందుకు పవన్ కమిటైన సంగతి తెలిసిందే. హరీష్ స్క్రిప్టుతో సిద్ధమవుతున్నారు. రేసుగుర్రం సురేందర్ రెడ్డి ఇంతకుముందు పవన్ కి ఓ స్క్రిప్టు వినిపించారు. ఆయన కూడా బౌండ్ స్క్రిప్టును వినిపించేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది. మరోవైపు పవన్ నవతరం దర్శకులతో పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చిరు – పవన్ ఇద్దరూ చెరో అరడజను చిత్రాలతో బిజీ. ఇవన్నీ వరుసగా రానున్న రెండేళ్లలో రిలీజ్ కానున్నాయి.