thesakshi.com : కాకినాడలో పరీక్షల్లో ఫెయిల్ కావడంతో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
సోమవారం రాత్రి కాకినాడ జగన్నాథపురం వంతెనపై నుంచి ఉప్పుటేరులోకి దూకిన యువకుడి ఆచూకీ మంగళవారం రాత్రి వరకు దొరకలేదు. జానపురెడ్డి వెంకటరమణ మంగళవారం కాకినాడ వన్ టౌన్ పోలీసులకు తన కుమారుడు దుర్గాప్రసాద్ 22 దూకేశాడని ఫిర్యాదు చేశాడు.
వివరాల్లోకి వెళితే బీటెక్ చదువుతున్న దుర్గాప్రసాద్ కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యి డిప్రెషన్‌లోకి వెళ్లాడు. ఈ నేపథ్యంలో తండ్రి మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లి చికిత్స అందించి ఇంటికి తిరిగి వస్తుండగా దుర్గాప్రసాద్ ద్విచక్ర వాహనంపై దిగి జగన్నాథపురం వంతెనపై నుంచి ఉప్పుటేరులోకి దూకాడు.
వెంకటరమణ ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.