Friday, March 5, 2021
THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • CRIME
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • CRIME
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

నవరత్నాల అమలు క్యాలెండర్ కు మంత్రివర్గ ఆమోదం

నవరత్నాల అమలు క్యాలెండర్ కు మంత్రివర్గ ఆమోదం
0
SHARES
165
VIEWS

thesakshi.com    :   ఏపీ కేబినెట్ మీటింగ్ ముగిసింది. ఈ మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతికి సంబంధించి ఇప్పటికే 50శాతం నిర్మాణం పూర్తయి పెండింగ్ లో ఉన్న భవనాలను పూర్తి చేయడానికి ఏఎం ఆర్డీయేకు రూ. 3వేల కోట్లకు బ్యాంకు గ్యారెంటీ ప్రభుత్వం ఇచ్చే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది.

ఇప్పటికీ ప్రారంభం కానీ.. కొద్దిగా ప్రారంభమైన ఇంజనీరింగ్ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ లో అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. హైకోర్టులో రాజధాని నిర్మాణం వ్యవహారాలపై విచారణ షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో నిర్ణయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

నవరత్నాలు అమలు క్యాలెండర్ కు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఇదివరకు తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఈబీసీ నేస్తం పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈబీసీ మహిళలకు మూడేళ్లలో రూ.45 వేల ఆర్ధిక సాయం 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు మహిళలకు పథకం వర్తింపును ఆమోదించింది.

పట్టణ ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను 300 చదరపు అడుగుల లోపు ఉంటే.. రూపాయికే లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే ఏప్రిల్ నుంచి జనవరి వరకు పథకాల అమలుకు ఆమోదించింది. 5.8 కోట్ల మంది లబ్ధిదారులకు అందించే పథకాల క్యాలెండర్కు ఆమోదం తెలిపింది.

కాకినాడ సెజ్ భూముల వ్యవహారంలో రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు నిర్ణయం. కమిటీ సూచించిన నష్ట పరిహారం కంటే కాస్త ఎక్కువే ఇవ్వాలని నిర్ణయించిన మంత్రివర్గం.

విశాఖ స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంపై కేబినెట్ లో కీలక చర్చ. ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించిన మంత్రివర్గం. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి, కేంద్రానికి పంపించాలని నిర్ణయం

అగ్రవర్ణ మహిళా పేదల కోసం ఉద్దేశించిన ఈబీసీ నేస్తం కింద 670 కోట్లు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం. 45-60 ఏళ్ల మధ్య వయసున్న అగ్రవర్ణ పేద మహిళలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. ఒక్కో మహిళకు ఏడాదికి 15వేలు చొప్పున మూడేళ్లకు 45 వేలు.

నవరత్నాలకు సంబంధించిన క్యాలెండర్ కు మంత్రివర్గం ఆమోదం. ఇకపై టైమ్ టేబుల్ ప్రకారం, సంక్షేమ పథకాల అమలు, లబ్దిదారులకు చేయూత.

పట్టణ ప్రాంతాల్లో లక్షా 43 వేలమంది లబ్దిదారులకు రూపాయికే (టిడ్కో ఇళ్లు 300 చదరపు అడుగుల లోపు ఉంటే) రిజిస్ట్రేషన్ పూర్తిచేసి ఇళ్లు అప్పగిస్తారు. ఇళ్ల కోసం తీసుకున్న లక్ష రూపాయల రుణంలో 50వేలు ప్రభుత్వమే చెల్లించాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ప్రభుత్వ లే-అవుట్స్ లో 5 శాతం భూమిని పేదలకు కేటాయించాలని నిర్ణయం.

కడప జిల్లాలో రెండు ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుపై చర్చ. వైఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం భాగస్వామ్య సంస్థను ఎంపిక చేయాలని నిర్ణయం

జగనన్న విద్యా దీవెన కింద పూర్తిగా ఫీజు రీఇంబర్స్ మెంట్.

Tags: #AP CABINET#GOVERNMENT OF ANDHRA PRADEHap cm ys jagancabinet meetingministersys jagan
ShareTweetSendSharePinShare
Previous Post

మద్యం మత్తులో ఉన్న భర్తను హత్య చేసిన భార్య!

Next Post

దేశంలో మరోసారి కరోనా విజృంభణ..!

Related Posts

మండలిలో పెరిగిన వైసీపీ బలం
Latest

మండలిలో పెరిగిన వైసీపీ బలం

March 5, 2021
ఏకగ్రీవాల జాతర కొనసాగించిన వైఎస్సార్సీపీ!
Latest

ఏకగ్రీవాల జాతర కొనసాగించిన వైఎస్సార్సీపీ!

March 4, 2021
మున్సిపోల్స్ లో వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా
Latest

మున్సిపోల్స్ లో వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా

March 3, 2021
Next Post
దేశంలో మరోసారి కరోనా విజృంభణ..!

దేశంలో మరోసారి కరోనా విజృంభణ..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

వాడే ఇదంతా చేస్తున్నాడు: కంగనా రనౌత్

వాడే ఇదంతా చేస్తున్నాడు: కంగనా రనౌత్

March 5, 2021
ఛాన్స్ ల కోసం తాపత్రయపడుతున్న సోనారిక

ఛాన్స్ ల కోసం తాపత్రయపడుతున్న సోనారిక

March 5, 2021
బ్రెజిల్ లో విజృంభిస్తోన్న కరోనా వైరస్!

బ్రెజిల్ లో విజృంభిస్తోన్న కరోనా వైరస్!

March 5, 2021
సజావుగా సాగని త్రిముఖ సంసారం..?

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య!

March 5, 2021
రిలయన్స్ గ్రూప్‌ ఉద్యగులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్

రిలయన్స్ గ్రూప్‌ ఉద్యగులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్

March 5, 2021
టాలీవుడ్ లో కిడ్నాప్ కలకలం!

కిడ్నాప్ ప్లాన్ విఫలయత్నం.. దేహశుద్ధి!

March 5, 2021

  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© 20212021 www.thesakshi.com All Rights Reserved.

No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • CRIME
  • Reviews

© 20212021 www.thesakshi.com All Rights Reserved.