thesakshi.com : శాసనసభలో జరిగిన పరిణామాలపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తన భార్య భువనేశ్వరిపై అధికార పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈరోజు సభలో కన్నీళ్లు పెట్టుకున్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కంటతడి పెట్టారు.
తన జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదని, తన కుటుంబాన్ని ఇంట్లోకి తీసుకురావడాన్ని తప్పు పట్టానని నాయుడు అన్నారు. తన 38 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరినీ కించపరచలేదన్నారు. ప్రజల నుంచి ఆదేశం వచ్చిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడతానని ప్రతిపక్ష నేత చెప్పారు.
అంతకుముందు టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు శాసనసభలో కాస్త ఉద్వేగానికి లోనై సభలో తన భార్యపై వ్యక్తిగత ఆరోపణలపై ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండున్నరేళ్లలో ఎన్నో అవమానాలు చవిచూశానని చెప్పారు. అయితే, స్పీకర్ మైక్ కట్ చేయడంతో నాయుడు సభ నుంచి బయటకు వెళ్లేందుకు తీవ్ర అవస్థలు పడ్డారు.
ప్రెస్ మీట్లో చంద్రబాబు కన్నీళ్లు..
ఇంతటి ఘోరమైన సభ చూడలేదు
కౌరవుల సభ లా వ్యవహరించారు
నా భార్యని నీచ రాజకీయాలలోకి లాగడం హేయం
తప్పని చెప్పాల్సిన స్పీకర్ నోరు మెదపలేదు
తమ్మినేని గతాన్ని మర్చిపోయారు ..
ఆత్మ విమర్శ చేసుకోవాలి
తమ్మినేని నాకు మైక్ ఇవ్వకపోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా
ఇంతకంటే నాకు ఎం పదవులు అవసరం లేదు ప్రజలు తెలుసుకోవాలి
తప్పులని వేరొకరిపై రుద్ది పైశాచిక ఆనందం పొందుతున్నారు
ధర్మానికి , అధర్మానికి జరుగుతున్న యుద్ధం ఇది ప్రజాక్షేత్రంలో తేలుచుకుంటా …రికార్డులు నాకు కొత్త కాదు …
రాజకీయాలకు సంబంధం లేని నా భార్యని దూషించడం నీచం
రాజకీయాల్లో విలువల ఉండాలనే ఇంతకాలం ఊరుకున్నాను
క్రమశిక్షణ ఉంది కాబట్టే …సైలెంట్ ఉన్నాను
మాకు చేతకాక కాదు ఇంత కంటే నీచంగా మాట్లాడగలను
ప్రజలు నాకు మద్దతు ఇవ్వాలి ..రాష్ట్రానికి పాటి పీడ వదలాలి
మళ్ళీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీ లో అడుగుపెడాతా
మన ఇంటి వాళ్ళని అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి అదే నా ఆవేదన ..అంటూ కన్నీటితో ప్రెస్ మీట్ ముగించిన చంద్రబాబు.
పవన్ కళ్యాణ్, జనసేన అధినేత
కుటుంబ సభ్యులను కించపరచటం తగదు.
ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ వైపరీత్యాలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి.
ఒక పక్క వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంటే ప్రజా ప్రతినిధులు ఇవేమి పట్టనట్టు ఆమోదయోగ్యంకాని విమర్శలు, వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం.
తన భార్యను కించపరిచారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే విధంగా మాట్లాడారని చంద్రబాబు కంట తడి పెట్టడం బాధాకరం.
ఇలాంటి ఘటనలు సామాన్యులకు రాజకీయ వ్యవస్థపై ఏహ్యభావం కలిగించే ప్రమాదం ఉంది.
ఈ మధ్యకాలంలో సభలు, సమావేశాలు చర్చల్లో కొన్నిసార్లు వాడుతున్న పదజాలం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉంటోంది.
ప్రతిపక్ష నేత కుటుంబసభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత శోచనీయం.
ఈ వ్యాఖ్యలు నిర్హేతుకంగా ఖండించదగినవి.
సీఎం జగన్ కుటుంబసభ్యులను తక్కువ చేసి కొందరు మాట్లాడినప్పుడు ఆనాడు కూడా ఆ వ్యాఖ్యలను ఇదే రీతిలో ఖండించాం.
ఆడపడుచుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు మరింత జాగ్రత్త వహించవలసి ఉంటుంది.