thesakshi.com : పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వారి కుటుంబాలను టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించి బాధితులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు వెంట పార్టీ నాయకులు కొల్లు రవీంద్ర తదితరులు ఉన్నారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 18 మంది మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే.
అంతకుముందు జంగారెడ్డిగూడెంకు విచ్చేసిన చంద్రబాబుకు దెందులూరు నియోజకవర్గంలో అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. పెదపాడు మండలం కలపర్రు టోల్‌ప్లాజా నుంచి నాయకులు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలతో తరలివచ్చారు.
సోమవారం పెదవేగి మండలంలోని సోమవరప్పాడు, గోపన్నపాలెం, గంగన్నగూడెం, ముండూరు, వేగివాడ గ్రామాల ప్రజలను చంద్రబాబు పలకరించారు. కార్యక్రమంలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి చంటి, పార్టీ కార్యాలయ కార్యదర్శి ప్రసాద్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.