Friday, March 5, 2021
THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • CRIME
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • CRIME
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్ ప్రభుత్వం

పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్ ప్రభుత్వం
0
SHARES
5
VIEWS

thesakshi.com   :    పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఈ రోజు జరిగిన విశ్వాసపరీక్షలో నారాయణ స్వామి ప్రభుత్వం తమ మద్దతు నిరూపించుకోవడంలో విఫలం అయ్యారు.దీనితో తో ఆయన తన రాజీనామా లేఖతో రాజ్ భవన్ కి బయలుదేరి వెళ్లారు. తన రాజీనామా లేఖను తమిళసై సౌందరరాజన్కు అందజేయనున్నారు. అధికార కూటమి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో మెజార్టీ 12కి పడిపోయిన విషయం తెలిసిందే.

మొత్తం 33 మంది సభ్యులున్న పుదుచ్చేరి అసెంబ్లీలో ఆరుగురు రాజీనామా చేయడంతో 26కి చేరింది. దీంతో బలపరీక్షలో కాంగ్రెస్ ప్రభుత్వం నెగ్గాలంటే సాధారణ మెజార్టీకి 14 మంది సభ్యులు అవసరం. కానీ కాంగ్రెస్ బలం స్పీకర్తో కలిసి 12కి పడిపోవడంతో బలపరీక్షలో సీఎం నారాయణసామి విఫలమయ్యారు. దీంతో సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు నారాయణసామి ప్రకటించారు. కాగా ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై ముందు మూడు అవకాశాలు ఉన్నాయి. బిజెపికూడా ఉన్న ప్రతిపక్ష కూటమికి బలం నిరూపించేందుకు అవకాశమివ్వడం లేదా రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం మూడు అసెంబ్లీని రద్దు చేయడం. లెఫ్టెనెంట్ గవర్నర్ తమిళ సై ఏ నిర్ణయం తీసుకుంటోందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అంతకు ముందు సోమవారం సాయంత్రం 5 గంటల్లోగా బలనిరూపణ చేసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఇచ్చిన ఆదేశాలతో అసెంబ్లీని సమావేశపరిచారు. ఈ సందర్భంగా సీఎం నారాయణసామి మాట్లాడుతూ.. తనకు మెజార్టీ ఉందని విశ్వాస పరీక్షలో నెగ్గుతామని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ డీఎంకే నేత స్టాలిన్ కారణంగా ముఖ్యమంత్రి అయ్యానని అన్నారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాలు గురించి సీఎం సభలో ప్రస్తావించారు.తనకు మద్దతుగా సభ్యులు ఓటేయాలని సీఎం కోరారు. ప్రజలు మా ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నట్టు స్పష్టమైందని అన్ని ఉప ఎన్నికల్లోనూ తమ కూటమి గెలిచిందన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రం కుట్రలు చేసిందని ఆరోపించారు.

Tags: #CONGRESS GOVERNMENT#INDIAN UNION TERRITORYpoliticalPuducherry
ShareTweetSendSharePinShare
Previous Post

పెట్రోల్.. డీజిల్ ధరలపై మితిమీరిన ఎక్సైజ్ డ్యూటీ : సోనియా

Next Post

డబ్బున్న అబ్బాయిలకు గాలం వేసి..మోసం చేస్తున్న కిలేడి లేడి

Related Posts

చంద్రబాబు ఆశలపై మోదీ నీళ్లు..?
Latest

ఇబ్బందుల్లో ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ పరిస్థితి..!

March 3, 2021
ఏపీ సీఎం జగన్ హస్తినకు..?
Latest

ఏపీ సీఎం జగన్ హస్తినకు..?

March 3, 2021
విమానాశ్రయంలో బైటాయించిన చంద్రబాబు
Latest

విమానాశ్రయంలో బైటాయించిన చంద్రబాబు

March 1, 2021
Next Post
అత్తపైనే కన్నేసిన అల్లుడు..చివరకు ఏమైందంటే..?

డబ్బున్న అబ్బాయిలకు గాలం వేసి..మోసం చేస్తున్న కిలేడి లేడి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

వాడే ఇదంతా చేస్తున్నాడు: కంగనా రనౌత్

వాడే ఇదంతా చేస్తున్నాడు: కంగనా రనౌత్

March 5, 2021
ఛాన్స్ ల కోసం తాపత్రయపడుతున్న సోనారిక

ఛాన్స్ ల కోసం తాపత్రయపడుతున్న సోనారిక

March 5, 2021
బ్రెజిల్ లో విజృంభిస్తోన్న కరోనా వైరస్!

బ్రెజిల్ లో విజృంభిస్తోన్న కరోనా వైరస్!

March 5, 2021
సజావుగా సాగని త్రిముఖ సంసారం..?

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య!

March 5, 2021
రిలయన్స్ గ్రూప్‌ ఉద్యగులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్

రిలయన్స్ గ్రూప్‌ ఉద్యగులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్

March 5, 2021
టాలీవుడ్ లో కిడ్నాప్ కలకలం!

కిడ్నాప్ ప్లాన్ విఫలయత్నం.. దేహశుద్ధి!

March 5, 2021

  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© 20212021 www.thesakshi.com All Rights Reserved.

No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • CRIME
  • Reviews

© 20212021 www.thesakshi.com All Rights Reserved.