కోవిడ్-19 ధర్డ్ వేవ్ డెల్టా వేరియంట్ లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇప్పటి వరకు కోవిడ్-19 వైరస్ యొక్క మొదటి మరియు రెండవ వేవ్ లను చూసాం. ఇప్పుడు రాబోయేది అత్యంత ప్రమాదకరమైన 3rd వేవ్ దీన్ని డెల్టా వేరియంట్ గా శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ ప్రమాదకారి అయిన డెల్టా వేరియంట్ లక్షణాలు కోవిడ్-19 మొదటి మరియు రెండవ దశ కన్నా చాలా భిన్నంగా ఉంటాయి. ఇది వరకులా దగ్గు మరియు జ్వరం వంటి లక్షణాలు ఏవీ లేకుండా ఎక్కువగా కీళ్ల నొప్పులు, మెడ మరియు మెడ వెనుక కండరాల నొప్పులు, నీరసం, ఆకలి లేకపోవడం మరియు న్యుమోనియా లక్షణాలను కలిగియుండి ఇదివరకటి వైరస్ కంటే ఎక్కువగా ప్రాణనష్టం సంభవించటానికి అవకాశాలున్నాయి.
ఈ డెల్టా వేరియంట్ వైరస్ ప్రభావం వలన మనిషి తీవ్రమైన అనారోగ్యానికి గురికావడా నికి అతితక్కువ సమయం తీసుకుంటుంది, కొన్ని సందర్భాలలో ఎటువంటి లక్షణాలు బయటపడకుండా సంక్రమిస్తుంది మరియు ఒకరినుండి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. కనుక మనమందరం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ దశలో వైరస్ ముక్కు మరియు గొంతు ప్రాంతాలపై దాని ప్రభావాన్ని చూపకుండా నేరుగా ఊపిరితిత్తుల లోకి ప్రవేశించి వాటిని పూర్తిగా దెబ్బ తీస్తుంది. ఈ వైరస్ సంక్రమించడానికి మరియు నిర్ధారణ జరగడానికి మధ్య చాలా స్వల్ప కాలిక వ్యవధి మాత్రమే ఉంటుంది. ఈ మూడవ దశ వేరియంట్ సోకిన చాలా మందికి ఎటువంటి జ్వరం మరియు నొప్పులు బహిర్గతం కాకుండా ఛాతి విభాగపు ఎక్సరే రిపోర్టు లొనే న్యుమోనియా లక్షణాలు కనపడుతాయి.
ఈ మూడవ దశ లో ముక్కు ద్వారా నిర్వహించే కోవిడ్ నిర్ధారణ పరీక్ష లో చాలావరకూ అందరికి నెగెటివ్ ఫలితాన్నే చూపిస్తుంది. దానికి ప్రధాన కారణం ఈ మూడవ దశ డెల్టా వేరియంట్ వైరస్ అనేది ఇదివరకు మల్లే ముక్కు మరియు గొంతు ప్రాంతాలలో చేరి నివాసముండదు.
కనుక మనం అర్ధం చేసుకోవలసిన విషయమేమిటంటే ఈ వైరస్ అతి త్వరగా, నేరుగా ఊపిరితిత్తుల పైన దాడి చేసి తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులకు గురిజేసి మనిషికి ప్రాణహాని కి గురిచేస్తుంది. అందుకే ఈ వేరియంట్ మొదటి మరియు రెండవ దశల వేరియంట్ ల కన్నా అత్యంత ప్రమాదకారి అని తెలుసుకోవాలి.
కావున అందరూ దయచేసి వ్యక్తిగత క్రమశిక్షణ ను పాటిస్తూ రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లకుండా ప్రతి ఒక్కరితో సుమారు 1.5 మీటర్లు భౌతిక దూరాన్ని పాటిస్తూ, రెండు మాస్కులను సక్రమంగా దరిస్తూ, చేతులను తరచుగా హేండ్ సానిటైజర్ మరియు సబ్బుతో శుభ్రపరచుకుంటూ బహిర్గత లక్షణాలు చూపని వైరస్ స్ట్రైన్ కనుక ఎవరితో ఆలింగనం మరియు కరచాలనం చేయకుండా అతిజాగ్రత్తగా నడుచుకోవాలి. ఈ వైరస్ మొదటి,రెండవ దశల కన్నా అత్యంత ప్రమాదకారి అన్న విషయాన్ని మనం గుర్తెరిగి అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవలయును.
ఈ మూడవ దశ డెల్టా వేరియంట్ యొక్క ప్రమాదకరక లక్షణాలను, పర్యవసానాలను మరియు తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలందరికీ తెలియజేసి సెన్సిటైజ్ చేసి ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా అందరిని అప్రమత్తం చేసి సామాజిక భాధ్యత తో వ్యవహరించాలి.