THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

తెలుగుదేశం (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కు కరోనా పాజిటివ్

thesakshiadmin by thesakshiadmin
January 18, 2022
in Latest, Politics, Slider
0
ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ
0
SHARES
10
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com    :   ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కరోనా కాటుకు గురయ్యారు. కొవిడ్ విలయం నేపథ్యంలో గడిచిన రెండేళ్లుగా అసాధారణ జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోన్న ఆయన తొలిసారి వైరస్ బారిన పడ్డారు.

I've tested positive for COVID with mild symptoms. I have quarantined myself at home and taking all the necessary precautions.

I would request those who came in contact with me to get themselves tested at the earliest. Please be safe and take care.

— N Chandrababu Naidu (@ncbn) January 18, 2022

కొడుకు నారా లోకేశ్ కు కరోనా సోకినట్లు తేలిన కొద్ది గంటల్లోనే చంద్రబాబుకూ ఇన్ఫెక్షన్ నిర్ధారణ అయింది. తనకు కరోనా సోకిన విషయాన్ని టీడీపీ అధినేత స్వయంగా మంగళవారం ఉదయం ప్రకటించారు. చంద్రబాబుకు కరోనా సోకిందన్న వార్త పార్టీ శ్రేణుల్లో ఆందోళన రేపగా, తన ఆరోగ్య పరిస్థితిపైనా బాబు వివరణ ఇచ్చారు.

తాజా టెస్టుల్లో తనకు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందన్న చంద్రబాబు.. వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని తెలిపారు. ఇన్పెక్షన్ తర్వాత వైద్యుల సూచనల మేరకు ఇంట్లోనే (హోం) ఐసోలేషన్ లో ఉన్నట్లు వెల్లడించారు.

అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాని చెప్పిన చంద్రబాబు.. ఇటీవల కాలంలో తనను కలిసి ప్రతి ఒక్కరూ విధిగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని, ఏ మాత్రం అనుమానం ఉన్నా ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు.

Tags: #ANDHRA PRADESH#CORONA #COVID-19#CORONA POSITIVE#NARA CHANDRA BABU NAIDU#TDP#TELUGU DESAM PARTY
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info