thesakshi.com : క్రికెట్ బెట్టింగుపై అనంత పోలీసుల ఉక్కుపాదం
జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసుల మెరుపు దాడులు…………. క్రికెట్ బెట్టింగు గుట్టురట్టు
ఇద్దరు ప్రధాన బుకీలు అరెస్టు, రూ.30,12,500/- నగదు, 2 ఆపిల్ సెల్ ఫోన్లు, 1 లెనోవా ట్యాబ్ స్వాధీనం
క్రికెట్ బెట్టింగుపై అనంతపురం నాల్గవ పట్టణ పోలీసులు ఉక్కుపాదం మోపారు. క్రికెట్ బెట్టింగు వ్యవహారం గుట్టురట్టు చేశారు. క్రికెట్ బెట్టింగు నిర్వహిస్తున్న ఇద్దరు కీలక బుకీలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేశారు. వీరి నుండీ రూ. 30,12,500/- నగదు, 2 ఆపిల్ సెల్ ఫోన్లు, 1 లేనోవా ట్యాబ్ స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారి ఉత్తర్వుల మేరకు మరియు అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి గారి ఉతర్వుల మేరకు అనంతపురము నాల్గవ పట్టణ ఇన్స్పెక్టర్ కత్తి శ్రీనివాసులు విలేకరుల సమావేశం నిర్వహించి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
అరెస్టయిన వారి వివరాలు… నేపథ్యం:
1) కరణం సాయినాథ్ ప్రసాద్, వయస్సు 42 సం., తండ్రి వెంగన్న చౌదరి, మారుతి నగర్, అనంతపురము.
ఇతను గత సంవత్సరం నుండి ఐపిడఎల్ క్రికెట్ సందర్బంగా బుకీ అవతారమెత్తి రోజూ లక్షల రూపాయల క్రికెట్ బెట్టింగ్ లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. ఈ అక్రమ వ్యవహారాన్ని పట్టణములో రోజుకు ఒక ప్రాంతములో గుట్టుగా కొనసాగించేవాడు.
2) కొప్పల రమేష్, వయసు 47 సం, తండ్రి వెంకటరాముడు, జగజ్జీవన్ రావు నగర్, ధర్మవరం టౌన్
ఇతను 2019 సంవత్సరంలో బెంగళూరు సిటీలో పని చేసే సమయములో, కర్ణాటక రాష్ట్రానికి చెందిన కొందరు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లతో పరిచయం ఏర్పడి, అప్పటి నుండి ప్రతి ఐపి్‌ఎల్ సీజన్ లో అనంతపురము, బెంగళూరు, హైదారాబాద్ లలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ, స్థానికంగా ఉన్న యువతను క్రికెట్ బెట్టింగ్ వైపుకు మళ్లించి, వారి సొమ్ములను బెట్టింగ్ రూపములో దోచుకొంటున్నాడు. ఇతనికి సాయినాథ్ ప్రసాద్ కు గత సంవత్సరములో పరిచయం ఏర్పడినది. ప్రస్తుతం ఇద్దరూ కలిసి క్రికెట్ బెట్టింగ్ బుకీలుగా మారి, అమాయకపు ప్రజలను క్రికెట్ బెట్టింగ్ వైపుకు లాగుతున్నారు.
ప్రస్తుతం ఐ.పి.ఎల్ క్రికెట్ మ్యాచ్ లు జరుగుతుండటంతో ప్రతీ మ్యాచ్, ప్రతీ ఓవర్, ప్రతీ బంతికి పందేలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అరెస్టు అయిన ఇద్దరు బుకీలు కాకుండా, జిల్లాలో ఉన్న ఇతర బుకీల కోసం విచారణ కొనసాగుతోంది.
** అరెస్టు క్రమం: జిల్లాలో క్రికెట్ బెట్టింగు, మట్కా, పేకాట , తదితర అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్రమంలో అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి ఆధ్వర్యంలో నాల్గవ పట్టణ ఇన్స్పెక్టర్ కత్తి శ్రీనివాసులు, ఎస్ ఐ లు జమాల్ బాషా, గంగాధర్ , చంద్రశేఖర్ లు మరియు ASI షైక్షావలి, HC’s శంకర్ , అనిల్ , సిబ్బంది నాగరాజు , రాజన్న , రమణ , అనిల్ నాయక్ CT రాజన్న బృందంగా ఏర్పడి ఇదే పనిలో నిమగ్నమయ్యారు. పక్కాగా రాబడిన సమాచారంతో స్థానిక మారుతి నగర్ లో ఐ.పిఎల్ టి-20 లో భాగంగా పంజాబ్ v/s చెన్నై మ్యాచ్ లో బెట్టింగు నిర్వహిస్తున్న పై ఇద్దరు బుకీలను అరెస్టు చేశారు. క్రికెట్ బెట్టింగు నిర్వహిస్తున్న సమయంలో ఈ బృందాలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసు బృందాలను జిల్లా ఎస్పీ అభినందించారు.