thesakshi.com : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.11 కోట్ల కొకైన్.. కడుపులో దాచుకొని బెంగళూరు ఎయిర్ పోర్టుకు వచ్చిన ఆఫ్రికన్ దేశస్థుడిని కస్టమ్స్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. బెంగళూరు ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు ఈ అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నాడు.
దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన ఆఫ్రికా దేశస్థుడు విమానంలో ప్రయాణం చేసేటప్పుడు ఆహారం మంచినీరు తీసుకోలేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు అతడిని స్కాన్ చేయగా.. పొట్టలో కొకైన్ ఉన్నట్టుగా గుర్తించారు.
అనంతరం అతడిని అదుపులోకి తీసుకొని వైద్యుల సహాయంతో అతడి కడుపులోని కొకైన్ ను బయటకు తీశారు. పట్టుబడిన ఈ కొకైన విలువ ఏకంగా రూ.11 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
హైటెక్ ముఠాలే ఇలా కడుపులో.. శరీరంలో పెట్టుకొని డ్రగ్స్ తరలిస్తారని.. మనిషి అనుమానాస్పదంగా ఉండడంతోనే అధికారులు చెక్ చేయగా దొరికినట్టు చెబుతున్నారు.