THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Crime

ఉత్తరప్రదేశ్ లో ఘోరమైన ఘటన !

thesakshiadmin by thesakshiadmin
October 17, 2021
in Crime, Latest
0
పోలీసులే దొంగలుగా మారిన వైనం..!
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com   :   ఉత్తరప్రదేశ్ లో 17ఏళ్ల మైనర్ బాలికపై ఆమె తండ్రి సహకారంతో అత్యాచారానికి పాల్పడిన సమాజ్ వాది పార్టీ, బహుజన సమాజ్ వాది పార్టీ నేతలు అరెస్టయ్యారు. తనపై కన్నతండ్రితో సహా మరో 28 మంది అత్యాచారానికి పాల్పడినట్లు… వారిలో BSP, SP ల జిల్లా అధ్యక్షులు కూడా వున్నట్లు యుదతి బయటపెట్టింది. ఆమె ఫిర్యాదుమేరకు ఉత్తర్ ప్రదేశ్  లలిత్ పూర్ జిల్లా సమాజ్ వాది పార్టీ అధ్యక్షులు తిలక్‌ యాదవ్‌, బిఎస్పీ అధ్యక్షులు దీపక్‌ అహిర్‌వర్‌ లను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ నిఖిల్‌ పాఠక్‌ వెల్లడించారు.

మొదట తన తండ్రి, ఆ తర్వాత అతడి సాయంతో మరికొందరు తనపై గత ఐదేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారని బాధిత యువతి బయటపెట్టింది. లలితపూర్జిల్లాలోని పల ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం చేసారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సదర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మీర్జాపూర్ జిల్లాలోని ఓ హోటల్ లో దాక్కున్న తిలక్‌ యాదవ్‌, దీపక్‌ అహిర్‌వర్‌ తో పాటు ఒక ఇంజనీరును అరెస్టు చేసారు.

లలిత్ పూర్ జిల్లా ఎస్పీ అధ్యక్షుడు తిలక్ యాదవ్ పై అత్యాచార ఆరోపణలు, అరెస్ట్ నేపథ్యంలో ఆ పార్టీ అదిష్టానం సీరియస్ అయ్యింది. మొత్తం జిల్లా పార్టీ కార్యవర్గాన్ని రద్దు చేసినట్లు సమాజ్ వాది ప్రకటించింది.

కొన్నేళ్లుగా తనపై జరిగిన అత్యాచారం గురించి బాధిత బాలిక తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ట్రక్ డ్రైవర్ గా పనిచేసే తండ్రి ఆరో తరగతిలో వుండగానే బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తెలిపింది. తల్లి ఇంట్లోలేని సమయంలో కొత్తబట్టలు కొనిపెడతానని ఒంటరిగా బయటకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది. అప్పటినుండి పలుమార్లు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసేవాడని… ఈ విషయం ఎవరికైనా చెబితే తల్లిని చంపేస్తానని బెదిరించేవాడని బాలిక తెలిపింది.

అయితే రానురాను తన తండ్రి మరింత నీచానికి దిగజారాడని… డబ్బుల కోసం తనను ఇతరుల వద్దకు పంపించేవాడని తెలిపింది. ప్రతిసారీ తనను ఓ హోటల్ కు తీసుకుని వెళ్లేవాడని… అక్కడ ఎవడో ఒకడు తనపై అత్యాచారానికి పాల్పడేవాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా ఓసారి సమాజ్ వాది పార్టీ జిల్లా అధ్యక్షుడు తిలక్ యాదవ్ కూడా తండ్రితో కలిసి తన వద్దకు వచ్చాడని… అడ్డుచెబుతున్నా వినకుండా బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత బాలిక వెల్లడించింది.

ఇక అప్పటినుండి పలుమార్లు తిలక్ సోదరులు, స్నేహితులు, బందువులు తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధిత బాలిక తెలిపింది. ఇలా తన తండ్రి సాయంతో ఇప్పటివరకు దాదాపు 28మంది అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక దయనీయంగా తెలిపింది. 17ఏళ్ల బాధిత బాలిక దయనీయ పరిస్థితి ప్రతిఒక్కరినీ కలిచివేస్తోంది. ముందు బాలిక తండ్రిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని… ఎంత పలుకుబడి వున్నా మిగతావారిని కూడా వదిలిపెట్టకూడదని డిమాండ్ చేస్తున్నారు.

Tags: #CRIME NEWS#UTTAR PRADESH
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info