thesakshi.com : ప్రత్యేక హోదాపై చర్చకు రాజ్యసభలో వైకాపా ఎంపీలు డిమాండ్ చేశారు. కొవిడ్‌పై చర్చ జరుగుతున్న సమయంలో వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు.
రాజ్యసభలో వైకాపా ఎంపీల నినాదాలుప్రత్యేక హోదాపై చర్చకు రాజ్యసభలో వైకాపా ఎంపీలు పట్టుపట్టారు. రాజ్యసభలో కొవిడ్‌పై చర్చ జరుగుతున్న సమయంలో వెల్‌లోకి వెళ్లిన వైకాపా సభ్యులు ప్లకార్డు చేతబట్టి… నినాదాలు చేశారు. కొవిడ్‌పై జరుగుతున్న చర్చకు సహకరించాలని వైకాపా ఎంపీలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విజ్ఞప్తి చేశారు. అయినా వైకాపా సభ్యులు ప్రత్యేక హోదాపై చర్చకు డిమాండ్ చేయటంతో రాజ్యసభను 15 నిమిషాలు వాయిదా వేశారు.
అనంతరం సభ ప్రారంభమైనా.. వైకాపా ఎంపీలు ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబట్టారు. మరోసారి వెల్‌లోకి వెళ్లి వైకాపా సభ్యుల నినాదాలు చేశారు. ప్లకార్డులు చేతబట్టి ఆందోళన చేశారు. ఎంపీల నినాదాల మధ్యే కొవిడ్‌పై చర్చ కొనసాగుతోంది.
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం మరోసారి పర్యావరణ అనుమతులు వాయిదా వేసింది. కృష్ణా నదిలో నీటి లభ్యతపై హోలిస్టిక్ నివేదిక కావాల్సిందేనని కమిటీ స్పష్టం చేసింది. నాలుగు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ వివరణకోరింది.
కేంద్ర ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి రెండోసారీ పర్యావరణ అనుమతులు వాయిదా వేసింది. ఈ నెల 7న దీనిపై పరిశీలన జరిపిన కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నాలుగు అంశాలపై మరింత వివరణ కోరింది. కృష్ణా నదిలో నీటి లభ్యతపై పూర్తిస్థాయి నివేదిక (హోలిస్టిక్ రిపోర్ట్) కావాలని అడిగింది. నదిపై ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులతోపాటు, భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులు, జల విద్యుత్కేంద్రాల వివరాలివ్వాలని కోరింది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి ముందు, తర్వాత రిజర్వాయర్ నుంచి నీటిని వాడుకునే విధానంపై అధ్యయన నివేదిక సమర్పించాలని సూచించింది.
ఈ ప్రాజెక్టు ఇరుగుపొరుగుతోపాటు, ఆ ప్రాంతంలో ఉన్న ఇలాంటి ఎత్తిపోతల పథకాలు, వాటి పర్యావరణ అనుమతుల గురించి పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది. ఈ ఎత్తిపోతల పథకం పూర్తిచేసి రిజర్వాయర్ నుంచి నీరు తీసుకున్న తర్వాత అందులో నీటి స్థాయి తగ్గిపోవడం వల్ల పర్యావరణపై పడే ప్రభావం, ఆ ప్రాంతంలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, రక్షిత అటవీప్రాంతాలు ఎక్కడెక్కడున్నాయో స్పష్టమైన లొకేషన్లు చూపాలని పేర్కొంటూ నిర్ణయాన్ని వాయిదా వేసింది.గతంలో 5 అంశాలపై..
జూన్ 16, 17 తేదీల్లో కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల అంశాన్ని అధ్యయనం చేసి ఏపీ ప్రభుత్వం నుంచి 5 అంశాలపై వివరణ కోరింది. ప్రభుత్వం అందజేసిన వివరాలపై ఈ నెల 7న ఈఏసీ సమావేశంలో చర్చించింది.