thesakshi.com : టీడీపీ నేతలపై తప్పుడు కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రానున్న కాలంలో ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తారని వ్యాఖ్యానించారు.
విద్యా దీవెన రాలేదని ఎమ్మెల్యే ప్రశ్నించినందుకు పూతలపట్టులో ఇంజనీరింగ్ విద్యార్థి జశ్వంత్‌పై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు.విద్యార్థులపై కేసులు పెట్టి జీవితాన్ని నాశనం చేశారని టీడీపీ అధినేత ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతపై ప్రభుత్వం అసహనంతో ఉందన్నారు. అక్రమ అరెస్టులు ప్రభుత్వ అసహనానికి ప్రత్యక్ష నిదర్శనమని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యార్థికి క్షమాపణలు చెప్పాలని, అతనిపై పెట్టిన కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
వేపనపల్లి గ్రామస్తులు, టీడీపీ నేతలపై పెట్టిన కేసులను కూడా ఉపసంహరించుకోవాలని, స్థానిక పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.