thesakshi.com : ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో అభివృద్ధి చేయాలి – ప్రజలు పట్టం కట్టిన ప్రజా ప్రతినిధులను గౌరవించండి – గృహ సంపూర్ణ హక్కును ప్రతి ఒక్కరికీ తెలియజేయండి – రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
కనగానపల్లి మండలం పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కుంపటి భాగ్యమ్మ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశాల్లో ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జడ్పీ చైర్మన్ గిరిజమ్మ పాల్గొన్నారు…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మన ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కలలు కంటున్న గ్రామ స్వరాజ్యం తోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యం అని నమ్మే ముఖ్య మంత్రి కలలు సాకారం కావాలంటే ముఖ్యంగా మండల అధికారుల సహాయ సహకారాలు ఎంతో అవసరం అని మండల అధికారులందరూ కలిసి కట్టుగా వుండి మండల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని చెప్పారు.
విధులు పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులు ఎవరైనా, ఎంతటి వారు అయిన వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. అలాగే గ్రామాల్లో అభివృద్ధికి రాజకీయ నాయకులు కూడా అధికారులకు తోడ్పాటు అందించాలని కలిసి కట్టుగా గ్రామీణ అభివృద్ధికి దోహదపడా లని చెప్పారు. తుఫాన్ తాకిడికి మొన్న కురిసిన వర్షాలకు రైతుల పంట పొలాలు నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించడం జరుగుతుందని చెప్పారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ సమావేశాలకు విధిగా సమయ పాలన పాటించాలని సూచించారు. సమావేశం లో ప్రజాప్రతినిధులు ప్రజలకు అవసరమైన విషయాలు గురించి చర్చించాలని అధికారులు ప్రజా సమస్యల పరిష్కారం పట్ల శ్రద్ధ చూపాలని కోరారు.
అనంతరం శాఖల వారిగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అధికారుల ద్వార వివరణ కోరి వాటి పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకున్నారు. పరిష్కారం కాని సమస్యలను గుర్తించి వాటిని ఆయా శాఖల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రధానమైన విధ్యుత్, శానిటేషన్, రక్షిత మంచినీరు, ప్రజారోగ్యం తో పాటు అత్యవసర సేవలు పట్ల యుద్ధప్రాతిపదికన స్పందించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ కార్యదర్శులు స్థానిక నాయకులు సమన్వయంతో కలిసి గ్రామాభివృద్ధి కోసం పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు మరియు మండల అధికారులు..