thesakshi.com : అక్రమ సంబంధాలు ఎంత దాచేద్దామనుకున్నా దాగవు. కరోనా వేళ అలా చాలా ఎఫైర్లు బయటపడ్డాయి. అందరూ ఇంటికే పరిమితం కావడంతో వారు బయట చేసే శ్రీరంగ నీతులు అన్ని బయటపడ్డాయి.
తాజాగా ఓ మహిళ ఒకరికి తెలియకుండా మరొకరితో ఇద్దరు మగాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఒక యువకుడితో ఎంజాయ్ చేస్తూ మరో కుర్రాడితోనూ ఆ మహిళ ఎఫైర్ పెట్టుకుంది. ఈ విషయంలో ఓ యువకుడికి తెలిసింది.
దాన్ని అతడు తట్టుకోలేకపోయాడు. తనతో మాత్రమే ఆ మహిళ ఎఫైర్ పెట్టుకోవాలని.. మరో కుర్రాడిని అడ్డు తొలగించుకోవాలని ఫిక్సయ్యాడు.నెమ్మదిగా మరో యువకుడితో స్నేహం చేసి పార్టీకి ఆహ్వానించి తోటి స్నేహితులతో కలిసి అతడిని హతమార్చాడు. మృతదేహానికి పెద్ద రాళ్లను కట్టి బావిలో పడేశాడు. ఇక అడ్డు తొలగిందని సంబరపడ్డాడు.
విజయనగరంలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగుచూసింది. విజయనగరం రూరల్ మండలంలోని పినవేమలికి చెందిన 25 ఏళ్ల కుర్రాడికి అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది.
అదే మహిళ మరో వ్యక్తితో కూడా వివాహేతర సంబంధం నడుపుతోంది. ఒకరికి తెలియకుండా మరొకరితో ఆ మహిళ శృంగారం జరుపుతూ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయం ఒకరికి తెలిసి రెండో వ్యక్తిని చంపేశాడు.
చనిపోయిన వ్యక్తి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎటువంటి ఆచూకీ లభించలేదు. అయితే బావిలో గుర్తు తెలియని శవం బయటపడింది. అది తమ బిడ్డదేనని తల్లిదండ్రులు గుర్తించారు. అన్ని కోణాల్లో విచారణ జరిపి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆరోజు చివరగా అక్కడ ఉన్న సిగ్నల్ ఉండడంతో నిందితులను పోలీసులు పట్టుకున్నారు.
చంపిన ప్రియుడిని సహకరించిన ముగ్గురు స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తానికి ఓ మహిళ చేసిన పాడు పనికి ఒక ప్రియుడు జైలు పాలు కాగా.. మరో ప్రియుడు కాటికి పోయాడు.