thesakshi.com : కుటుంబ సమస్యలపై డిబేట్లు పెట్టడం విశ్లేషించడం ప్రజలకు సులువైన వ్యాపకం. ఏదైనా ఒక సంఘటన జరిగితే దానిపై అందరిలో ఆసక్తి. ఎవరికి తోచింది వారు తమ అభిప్రాయాన్నివ్యక్తం చేస్తుంటారు. ప్రతి విశ్లేషణ ఒకవైపే వుంటుంది .. అంటే వన్సైడ్ అన్నమాట. అలాంటి విశ్లేషణకు నిబద్ధత.. నిజాయితీ అంటూ వుంటుందంటే అది హాస్యాస్పదమే అవుతుంది. సమంత విడాకులకు విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగిందా..?.. జరుగుతోందా?.. అంటే చాలా మంది యస్ అనే చెబుతున్నారు
నాగచైతన్య – సమంత విడాకులు తీసుకోబోతున్నారంటూ మొదలైన విశ్లేషణల పర్వం ఇప్పటికీ కొనసాగుతూనే వుంది. ఇటీవలే ఈ ఇద్దరు తాము విడిపోతున్నామంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వార్త ప్రతీ ఒక్కరినీ షాక్ కు గురి చేసింది. అక్కినేని అభిమానులే కాకుండా సామాన్య సినీ ప్రియులు కూడా అందమైన జంట సడన్ గా విడాకులు ప్రకటించడం ఏమిటా అని అంతా అవాక్కయ్యారు కూడా. ఇదే ఇష్యూ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు సామాన్య జనాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.
ఎప్పుడైతే నాగచైతన్య – సమంత తామిద్దరం విడిపోతున్నామని ప్రకటించారో లేదో ఈ వార్తపై రకరకాల వార్తలు పుట్టుకురావడం మొదలైంది. క్రేజీ జంట న్యూస్ కావడంతో ఎవరికి తోచింది వారు వండి వార్చడం మొదలుపెట్టారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో గమనించిన విషయం ఏంటంటే కేవలం సమంతని టార్గెట్ చేస్తూ వార్తలు పుట్టుకు రావడం.. విశ్లేషణలు తెరపైకి రావడం మొదలైంది. చాలా మంది ఉద్దేశ పూర్వకంగా ఈ తరహా వార్తల్ని ప్రచారంలోకి తీసుకొస్తే కొంత మంది మాత్రం తాము టార్గెట్ చేస్తున్నామన్న భావన తెలియకుండానే టార్గెట్ చేయడం కనిపించింది.
ఒక సంఘటన జరిగితే ఇరు వైపుల వాదనలు వుంటాయి.. వింటారు. విశ్లేషిస్తారు. కానీ అవేవీ సమంత డైవర్స్ విషయంలలో ఏ ఒక్కరూ పట్టించుకోలేదు సరికదా కనీస విలువల్నికూడా పాటించలేదు. కనీసం మన ఇంట్లో ఒక అమ్మాయి వుందన్న విషయాన్ని కూడా మరిచి గర్భం.. అబార్షన్ ల గురించి.. వార్తల్ని తెరపైకి తీసుకొచ్చారు. అంతే కాకుండా కొన్ని మీడియా ఛానల్ లు ఇదే విషయాలపై కొంత మంది నటీనటులతో డిబేట్ లు కూడా నిర్వహించాయి. కానీ ఈ ఇష్యూలో ఒకవైపే తప్పుల్ని ఎంచకుండా ఇరు వైపుల వున్న లోపాలని.. సమస్యల్ని ప్రస్తావించి వుంటే బాగుండేదని సోషల్ మీడియా వేదికగా పలువురు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా సమంత పెట్టిన పోస్ట్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. `ఓ మహిళ చేస్తే చాలా ప్రశ్నలు మొదలౌతాయి. అదే పని ఓ పురుషుడు చేస్తే మాత్రం పెద్దగా ఎవరూ ప్రశ్నించరు. అలా ప్రశ్నించలేనప్పుడు ఈ సమాజానికి ఎలాంటి నైతికత లేనట్టే. కొంత మంది నాకు ఎఫైర్ వుందన్నారు. పిల్లలు పుట్టకూడదని భావించానని.. తాను అవకాశ వాదినని.. అబార్ఫన్స్ చేయించుకున్నానని అన్నారు. విడాకులు అనేది చాలా పెయిన్ ఫుల్ ఇష్యూ. ఇలా ప్రతిసారీ నాపై వ్యక్తిగత దాడి జరిగింది. అయితే నేను మీకు ప్రామిస్ చేస్తున్నా.. ఈ దాడి నన్ను ఏమీ చేయలేదు` అంటూ సమంత పెట్టిన పోస్ట్ తనపై వ్యక్తిగతంగా వన్ సైడ్ దాడి జరిగింది.. జరుగుతోందని స్పష్టం చేస్తోంది.
సామ్ తాజా పోస్ట్ లని బట్టి విడాలకు ఇష్యూని వన్ సైడ్ చూడకుండా ఇరు వైపుల దృష్టికోణం నుంచి చూస్తే బాగుంటుందన్నది మెజారిటీ వర్గాల వాదన. ఇప్పటికైనా ఈ ఇష్యూని ఇరు వర్గాల దృక్కోణం నుంచి ఆలోచిస్తారని.. కేవలం సమంతని మాత్రమే టార్గెట్ చేయడం మానేసి సమస్య లోతుల్లోకి వెళ్లి ఆలోచించాలని ఇండస్ట్రీ వర్గాలతో పాటు సామ్ అభిమానులు సామన్యులు కోరుకుంటున్నారు. సమంత ప్రస్తుతం `శాకుంతలం` చిత్రంతో పాటు నయనతార బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తోంది. ఇందులో సమంతతో పాటు నయనతార కూడా నటిస్తోంది.