thesakshi.com : దళిత నాయకత్వం కింద పని చేయరా..?
ఆ యువ నాయకురాలికి అడుగడుగునా అడ్డంకులే ?
ఆ మండలాల్లో తిరగాలంటే వారి అనుమతి తప్పనిసరి
లేదంటే అధిష్టానానికి ఫిర్యాదులు_
పార్టీ కార్యక్రమాలకు ఆ దళిత విద్యాధికురాలు పిలవాలనుకుంటే ఫోన్ బ్లాక్ లిస్ట్
పెళ్లి పిలుపులపై సైతం ఆంక్షలు_
మండల స్థాయి నాయకుల పై కార్యకర్తల్లో వెల్లువెత్తుతున్న నిరసనల సెగ_
శింగనమల నియోజకవర్గం లో దళిత యువతి అయిన ఆ అమ్మాయి విద్యాధికురాలు …..అదీగాక జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ పొందింది… నమస్తే అన్నా! అంటూ తన ఇంటికి వచ్చిన కార్యకర్తలందరినీ ఆప్యాయంగా పలకరిస్తుంది…. ఆ యంగ్ డైనమిక్ పేరే బండారు శ్రావణి .. నియోజకవర్గ ఇంఛార్జి గా టీడీపీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు….అయితే మొదటి నుండి స్వలాభం కోసం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న ఒకరిద్దరు నాయకులకు పార్టీ కోసం నిస్వార్థంగా సేవచేస్తున్న ఆమె దూకుడు స్వభావం నచ్చలేదు… తాము చెప్పినట్లు నడుచుకోకుండా స్వతంత్రంగా వ్యవహరించడంపై అగ్రవర్ణాలకు చెందిన ఒకరిద్దరు మండల స్థాయి నాయకులు అధిష్టానం వద్ద తమ ఫిర్యాదుల పరంపరను కొనసాగించారు.
స్థానికంగా ఉన్న టిడిపి నాయకులను దళిత యువతి వద్దకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు.. తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి బండారు శ్రావణి అందరినీ సమన్వయం చేసుకొని కలుపుకోవాలని ప్రయత్నించినా వారు మాత్రం తమ ఆదేశాల_ ప్రకారమే నడుచుకోవాలని శ్రావణికి స్పష్టం చేశారు… విద్యాధికురాలైన ఆ యువతి , తనను వ్యతిరేకించే మండల స్థాయి నాయకులను కలుపుకోవడానికి ఎంతగానో ప్రయత్నించారని శ్రావణి అనుచరులు పేర్కొంటున్నారు.
పార్టీ కార్యక్రమాల వివరాలు తెలియజేయడానికి ప్రయత్నిస్తే వారి సెల్ ఫోన్ లో బండారు శ్రావణి నంబర్ బ్లాక్ చేశారని శ్రావణి అనుచరులు బాహాటంగానే తమ బాధను వ్యక్తం చేస్తున్నారు… నార్పల మండలంలో ఒక తెలుగుదేశం సానుభూతిపరుడు తన కుటుంబం లో జరుగుతున్న వివాహ వేడుకకు బండారు శ్రావణిని ఆహ్వానిస్తే… అదేదో నేరం అయినట్లు తెలుగుదేశం సానుభూతిపరుడిని…. ఒక మండల స్థాయి నాయకుడు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడినట్లు శ్రావణి అనుచరులు తమను కలిసిన విలేకరులకు తెలియజేశారు.
ఇన్ని అవమానాలు దిగమింగి శింగనమల నియోజకవర్గంలో టిడిపి బలోపేతానికి శక్తివంచన లేకుండా బండారు శ్రావణి శ్రమిస్తుంటే ఆ అమ్మాయి అధికారాలకు కత్తెర వేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు… పార్టీ కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్న దళిత నాయకురాలైన బండారు శ్రావణిని కాదని అగ్రవర్ణాలకు చెందిన నాయకులను పార్టీల కమిటీల ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వడం ఏమిటని అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు…