thesakshi.com : విద్య మనిషి చరిత్రను, కుటుంబ చరిత్రను, సామాజిక చరిత్రను, రాష్ట్ర చరిత్రను, దేశ చరిత్రను మారుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తిరుపతి పర్యటన సందర్భంగా గురువారం తారకరామ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
భగవంతుడి దయతో మంచి కార్యక్రమం జరుగుతోందని సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారు. విద్య అనేది దొంగిలించలేని గొప్ప ఆస్తి అని అన్నారు. కుటుంబాల భవిష్యత్తును మార్చే శక్తి విద్యకు ఉందని నేను నమ్ముతున్న వ్యక్తిని, 10.85 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చడం సంతోషంగా ఉందని సీఎం జగన్ అన్నారు.
రాష్ట్రంలో విద్యా దీవెన గొప్ప పథకమని, అవినీతికి తావులేకుండా ప్రభుత్వం నేరుగా తల్లీబిడ్డల ఖాతాల్లో జమ చేస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. “గత ప్రభుత్వం తక్కువ ఫీజులు మరియు రీయింబర్స్‌మెంట్‌లతో వ్యవహరిస్తుండగా, మేము బకాయిలను సక్రమంగా చెల్లిస్తున్నాము మరియు విద్యావ్యవస్థను సమర్థవంతంగా నడుపుతున్నాము” అని సిఎం అభిప్రాయపడ్డారు.
తల్లిదండ్రులను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం, మన ప్రభుత్వంలో వచ్చిన మార్పును గమనించాలని, ప్రస్తుత ప్రభుత్వం మాదిరిగా గత ప్రభుత్వం ఏమైనా పథకాలు ప్రవేశపెట్టిందా అని ప్రశ్నించారు.
చంద్రబాబు పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఇంగ్లిషు మీడియం చదువులు.. బాబు హయాంలో ఉన్నాయా? పేద పిల్లలను ఇంగ్లిషు మీడియంలో చదివిస్తే.. ప్రశ్నిస్తారనే దిక్కుమాలిన ఆలోచన చంద్రబాబుదని దుయ్యబట్టారు. తిరుపతి తారకరామ స్టేడియంలో గురువారం జరిగిన ‘విద్యాదీవెన నగదు జమ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు, ఎల్లో మీడియా తీరును ఎండగట్టారు.
‘గత ప్రభుత్వంలో జగనన్న ‘అమ్మ ఒడి’ అనే పథకం ఎక్కడైనా ఉందా?. ఈ రాష్ట్రంలో ఏనాడైనా, ఎక్కడైనా ఇలా ఉందా?. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడులాంటి కార్యక్రమం గతంలో ఉందా?. చంద్రబాబు హయాంలో ఇలాంటి కార్యక్రమం ఏనాడైనా జరిగిందా?. ప్రభుత్వ బడులు మూసేసి, చదువుల భారాన్ని దించుకోవాలని చంద్రబాబు ప్రయత్నించలేదా?. ఆ రోజుకూ, ఈ రోజు కూ తేడాలు చూడండి. పేదల పిల్లలు చదువులు ఎందుకు మానేస్తున్నారని ఎప్పుడైనా గతంలో ఆలోచించారా యూనిఫారం, షూలు, సాక్సులు, తెలుగు-ఇంగ్లిషుల్లో పాఠ్యపుస్తకాలు, డిక్షనరీ, నోట్‌బుక్స్, స్కూల్‌బ్యాగ్.. ఇలాంటివన్నీ జగనన్న విద్యాకానుక మాదిరిగా ఎప్పుడైనా గతంలో ఇచ్చారా?. సరిగ్గా స్కూలు తెరిచే సమయానికి ఇచ్చారా? స్కూలు తెరిచిన ఆరేడు నెలలు తర్వాత టెక్ట్స్‌బుక్స్ ఇచ్చేవారంటూ’’ సీఎం మండిపడ్డారు.