thesakshi.com : హత్యలు ఒక్క మనదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో జరుగుతున్నాయి. తాజాగా బ్రిటన్ లోని ఒక ఎంపిని మరోవ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. చర్చిలో స్ధానికులతో ఎంపి సమావేశమైనపుడు హఠాత్తుగా ఒకవ్యక్తి ఎంపి దగ్గరకు వచ్చారు. ఏదో మాట్లాడుతున్నట్లుగా ఎంపికి బాగా దగ్గరకు వచ్చిన సదరు వ్యక్తి ఉన్నట్లుండి తన దగ్గర దాచుకున్న కత్తిని తీసి ఎంపిని పొడిచేశాడు. కడపులోను చాతిపైన నడుంపైనా సదరు వ్యక్తి విచక్షణా రహింతంగా పొడవటంతో ఎంపి అక్కడికక్కడే కుప్ప కూలిపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్ళినా ఉపయోగం కనబడలేదు.
ఇంగ్లాండ్ లోని ఎస్సెక్స్ లోని సౌత్ ఎండ్ వెస్ట్ నుండి డేవిడ్ ఎమెస్ (69) ఎంపిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కు చెందిన కన్సర్వేటివ్ పార్టీలో కీలక నేతగా ఉన్న ఎమెస్ 1983 నుండి వరసగా ఎంపిగా గెలుస్తునే ఉన్నారు. జంతు సమస్యలు మహిళల గర్భస్రావాలకు వ్యతిరేకంగా ఎంపి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. అనేక సమస్యలపై పార్లమెంటులో కూడా ఎమెస్ అనేకసార్లు గళమిప్పారు.
ఎంపి మృతిపై ప్రధానమంత్రి తో సహా అనేకమంది దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. ఎంపి కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత కీత్ స్టార్మర్ ఎంపి హత్యను తీవ్రమైన చర్యగా అభివర్ణించారు. అయితే ఎంపిపై దాడి చేయటం హత్య చేయటం ఇదే మొదటిసారి కాదు. గతంలో అంటే 2016లో బ్రిగ్జెట్ ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో కూడా ఓ ఎంపిపై కాల్చి చంపేశారు. 2010లో కూడా లేబర్ పార్టీ ఎంపి స్టీవెన్ టిమ్స్ కూడా కత్తిపోట్లకు గురై చనిపోయారు.