thesakshi.com : హైదరాబాద్‌లో డ్రిల్‌మెక్ గ్లోబల్ ఆయిల్ రిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్..
200 మిలియన్ US డాలర్ల పెట్టుబడి, 2500 మందికి ఉపాధి
Drillmec ఎస్‌పిఏ(SpA), తెలంగాణ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం (MoU)
మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థ డ్రిల్‌మెక్
తెలంగాణ కేంద్రంగా భారీ ఆయిల్ రిగ్గులను తయారు చేయనున్న డ్రిల్‌మెక్
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి సంస్థ వచ్చింది. ఆయిల్ డ్రిల్లింగ్ రిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ దిగ్గజ కంపెనీ డ్రిల్‌మెక్ ఎస్‌పిఏ హైదరాబాద్‌లో 200 మిలియన్ US డాలర్ల (రూ.1500 కోట్ల )భారీ పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఏడాదికి 200 మిలియన్ US డాలర్ల టర్నోవర్ ఉన్న డ్రిల్‌మెక్, మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) గ్రూప్‌కు అనుబంధ సంస్థ.
తెలంగాణలో ఆయిల్ రిగ్‌లు మరియు అనుబంధ పరికరాల తయారీ కోసం డ్రిల్‌మెక్ ఇంటర్నేషనల్ హబ్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలు & వాణిజ్య శాఖతో డ్రిల్‌మెక్ అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదుర్చుకుంది. Drillmec SpA, CEO, సిమోన్ ట్రెవిసాని, తెలంగాణ పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్‌లు ఎంఓయూపై సంతకాలు చేశారు.
చమురు, ఇందనం వెలికితీసే హైటెక్ రిగ్గులను తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి వినియోగంలోకి తెచ్చిన ఘనత మేఘా ఇంజనీరింగ్ (Drillmec SpA) సొంతం చేసుకుంది. ఆన్‌షోర్, ఆఫ్‌షోర్లో చమురు వెలికితీసేందుకు అవసరమైన అత్యాధునిక డ్రిల్లింగ్ రిగ్గుల తయారీతోపాటు, వర్క్‌ఓవర్ రిగ్‌ల రూపకల్పన, తయారీ, సరఫరాలో గ్లోబల్ లీడర్‌గా ఉంది. డ్రిల్లింగ్ రిగ్గులకు అవసరమైన విస్తృత శ్రేణి విడిభాగాల తయారీలో కూడా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టతలను సొంతం చేసుకుంది.
డ్రిల్‌మెక్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 600 డ్రిల్లింగ్ రిగ్‌లను పంపిణీ చేసింది. రిగ్గుల రూపకల్పనలో అనేక వినూత్న డిజైన్లను అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా పేటెంట్లను పొందింది. ఇటలీలోని పోడెన్‌జానో పిసి కేంద్రంగా రిజిస్టర్డ్ కార్యాలయం ఉన్న డ్రిల్‌మెక్ కంపెనీని 2020లో MEIL గ్రూప్ కొనుగోలు చేసింది. డ్రిల్‌మెక్ SpA, తెలంగాణ పరిశ్రమలు & వాణిజ్య శాఖ, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి రిగ్గు పరికరాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV)ని ప్రారంభించనుంది.
ఈ సందర్భంగా డ్రిల్‌మెక్ స్పా ప్రతినిధి సిమోన్ ట్రెవిసాని మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం గొప్ప గౌరవమని, ఈ తయారీ యూనిట్ దేశంలో ఇంధన భద్రతకు భరోసా ఇస్తుందని అన్నారు. అంతేకాకుండా “ఈ తయారీ కేంద్రం వల్ల సుమారు 2,500 మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని” చెప్పారు.
Drillmec గురించి:
డ్రిల్ మెక్ సంస్థ సముద్ర గర్భంలోనూ, భూ ఉపరితలంపైన (ఆఫ్ షోర్, ఆన్ షోర్) చమురు వెలికితీసేందుకు అవసరమైన రిగ్గులు, భారీ యంత్రాలు, వాటి పరికరాలను ఉత్పత్తి చేసి అంతర్జాతీయ సంస్థలకు సరఫరా చేస్తోంది. ప్రపంచంలో పేరెన్నికగన్న టోటల్, షెల్, కైరాన్, ఓఎన్జీసి, బ్రిటీష్ పెట్రోల్ మొదలైన 40 కిపైగా కంపెనీలు డ్రిల్ మెక్ రిగ్గులను వినియోగిస్తున్నాయి.
ఇటలీతో పాటు యూరప్, అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా మొదలైన 40కిపైగా దేశాలలో డ్రిల్ మెక్ రిగ్గులు చమురు వెలికితీతలో ఉన్నాయి.
ఈ సంస్థకు ప్రపంచంలో రష్యా, ఇటలీ, అమెరికా, బెలారస్ దేశాల్లో (4 ప్రాంతాల్లో) రిగ్గుల తయారీ కేంద్రాలు ఉన్నాయి. భారతదేశంలో ఇప్పుడు హైదరాబాద్‌లో మరో తయారీ సంస్థను స్థాపిస్తోంది.
ఆన్‌షోర్ రిగ్ పోర్ట్‌ఫోలియోలో హుక్ లోడ్ పరిధిలో 60 మెట్రిక్ టన్నుల (66 షార్ట్ టన్నులు) నుండి 907 మెట్రిక్ టన్నుల సామర్థ్యం (999 షార్ట్ టన్నులు) వరకు డ్రిల్లింగ్ రిగ్‌లు తయారు చేస్తారు.
ఇందులో సాంప్రదాయ డ్రిల్లింగ్ రిగ్‌లు, స్వింగ్ లిఫ్ట్ లేదా స్లింగ్‌షాట్, మొబైల్ రిగ్‌లు, ఆటోమేటిక్ రిగ్స్, హైడ్రాలిక్, HH సిరీస్ మరియు STRIKER-800® వంటి సాంప్రదాయేతర ప్లే రిగ్‌లు విస్తృతంగా వాడుతున్నారు.
భూ ఉపరితలంపై నుంచి ఆపరేట్ చేసే డ్రిల్లింగ్ రిగ్‌లు కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో సైతం పని చేయడానికి అనువుగా రూపొందించబడ్డాయి. అత్యంత సవాలుగా మారే డ్రిల్లింగ్ ప్రోగ్రామ్‌లను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.