Tuesday, April 13, 2021
THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • CRIME
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • CRIME
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

45 సంవత్సరాల పైబడిన వారందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలి

బడ్జెట్ అంచనాలు కేటాయింపులు కోసం విధి విధానాలు ఖరారు: సిఎం కెసిఆర్
0
SHARES
5
VIEWS

thesakshi.com   :   దేశవ్యాప్తంగా కరోనా తిరిగి వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ మాస్కులు ధరించి సునిశిత జాగ్రత్తలు పాటించాలని, కరోనా కట్టడికోసం ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలను కోరారు.

మన రాష్ట్రంలో ముఖ్యంగా జనం రద్దీగా వుండే ప్రాంతాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ప్రజలతో పాటు కార్పోరేషన్లు, మున్సిపాలిటీల ప్రజలు కరోనా పట్ల మరింత అప్రమత్తతతో మెలగాలని సీఎం సూచించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడి నిర్వహించిన సీఎంల వీడియో కాన్ఫరెన్స్ లో సిఎం కెసిఆర్ మాట్లారాడు.

అనంతరం వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో, రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై సిఎం సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో కరోనా తిరిగి పునరావృతమౌతున్న నేపథ్యంలో కరోనా పరీక్షలను భారీగా పెంచాలని అధికారులను ఆదేశించారు.

అన్ని విభాగాలకు చెందిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి వందశాతం వ్యాక్సినేషన్ చేయించాలన్నారు.

ఈ ప్రక్రియను వారం రోజుల్లో యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.

ఈసందర్భంగా డిజిపి మహేందర్ రెడ్డి, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మతో ఫోన్లో మాట్లాడారు.

వారి వారి శాఖల్లో పనిచేసే సిబ్బంది మొత్తానికి వాక్సినేషన్ ప్రక్రియను వారం రోజుల్లో నూటికి నూరు శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.

వాక్సినేషన్ పురోగతిని ప్రతీ రోజు ఆయా శాఖల ఉన్నతాధికారులు సీఎంవోకు రిపోర్ట్ చేయాలని స్పష్టం చేశారు.

పోలీస్, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఆర్టీసీ , రెవెన్యూ శాఖల సిబ్బందికి వందశాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టడం కోసం కలెక్టర్లు, ఇతర జిల్లా స్థాయి అధికారులతో వెంటనే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కరోనా పరీక్షల సంఖ్యను భారీగా పెంచేందుకు , అన్ని జిల్లాల్లోనూ కరోనా ను నిర్ధారించే ఆర్టిపిసిఆర్ పరీక్షా కేంద్రాలను విస్త్రుతంగా ఏర్పాటు చేయాలన్నారు.

అవసరమైన మేరకు ఆర్టిపిసిఆర్ కిట్స్
తక్షణమే తెప్పించాలని అధికారులను ఆదేశించారు.

గద్వాల, వనపర్తి, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, జగిత్యాల, పెద్దపల్లి, రామగుండం, భువనగిరి, జనగామ, వికారాబాద్ కేంద్రాల్లో ఆర్టిపిసిఆర్ పరీక్షా కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని వైద్య అధికారులను సీఎం ఆదేశించారు.

thesakshi.com   :   కరోనా నియంత్రణ కోసం కీలకమైన మాస్కులు ధరించే నిబంధనను కఠినంగా అమలు పరచాలన్నారు. ప్రజలు మాస్కు ధరించకపోతే వేయి రూపాయల జరిమానా విధించేలా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో… ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఈ నిబంధనను అందరూ పాటించేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని డిజిపిని సీఎం ఆదేశించారు.

45 సంవత్సరాల పైబడిన వారందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సీఎం ప్రజలను కోరారు.

Tags: #CORONA VACCINATIONCm kcrCorona viruscovid-19telangana
ShareTweetSendSharePinShare
Previous Post

ఏప్రిల్ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ :ప్రధాని నరేంద్రమోదీ

Next Post

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎక్కడ..?

Related Posts

భారత్‌లో మరో వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతి
Latest

భారత్‌లో మరో వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతి

April 12, 2021
మీరు ఎప్పుడైనా యంగ్ గా ఉన్న కేటీఆర్ ను చూశారా?
Latest

మీరు ఎప్పుడైనా యంగ్ గా ఉన్న కేటీఆర్ ను చూశారా?

April 12, 2021
రెమెడిసివిర్ డ్రగ్ కు భారీగా పెరిగిన డిమాండ్..!
Latest

రెమెడిసివిర్ డ్రగ్ కు భారీగా పెరిగిన డిమాండ్..!

April 12, 2021
Next Post
అధినేతపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎంపీ రఘురామ..!

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎక్కడ..?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

వాలంటీర్ల సేవలకు గుర్తింపునీచ్చిన సీఎం వైఎస్ జగన్

వాలంటీర్ల సేవలకు గుర్తింపునీచ్చిన సీఎం వైఎస్ జగన్

April 12, 2021
తుపాకీ మిస్ ఫైర్ కేసులో నమ్మలేని నిజాలు వెలుగులోకి..!

తుపాకీ మిస్ ఫైర్ కేసులో నమ్మలేని నిజాలు వెలుగులోకి..!

April 12, 2021
ఎనర్జిటిక్ పెర్ఫామర్ గా పాపులరైన కన్నడ బ్యూటీ!

ఎనర్జిటిక్ పెర్ఫామర్ గా పాపులరైన కన్నడ బ్యూటీ!

April 12, 2021
నా భార్యను చంపటానికి ఆ ఎస్ఐనే కారణం..!

నా భార్యను చంపటానికి ఆ ఎస్ఐనే కారణం..!

April 12, 2021
భారత్‌లో మరో వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతి

భారత్‌లో మరో వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతి

April 12, 2021
అంగ‌రంగ వైభ‌వంగా జెమినీ సంస్థ డైమండ్ జూబ్లీ ఉత్స‌వాలు

అంగ‌రంగ వైభ‌వంగా జెమినీ సంస్థ డైమండ్ జూబ్లీ ఉత్స‌వాలు

April 12, 2021

  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© 20212021 www.thesakshi.com All Rights Reserved.

No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • CRIME
  • Reviews

© 20212021 www.thesakshi.com All Rights Reserved.